Jammu and Kashmir Earthquake: జమ్మూ‌కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు

జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున 5.15 గంటలకు కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది.

Jammu and Kashmir Earthquake: జమ్మూ‌కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు

Jammu and Kashmir Earthquake

Jammu and Kashmir Earthquake: జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున 5.15 గంటలకు కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఐదు కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఇదిలాఉంటే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.

Massive Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. భవనాలు నేల మట్టం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు

భారతదేశంలోని ఈశాన్య భాగం మాదిరిగానే జమ్మూ, కాశ్మీర్ కూడా భూకంప క్రియాశీల జోన్ లోకి వస్తుంది. ఈకారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలన మొత్తం 20 జిల్లాల్లో అత్యాధునిక అత్యవసర ఆపరేషన్ కేంద్రాలను (ఈఓసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూకంపం, వరదలు ఇతర ప్రకృతి వైపరిత్యాల నష్టాన్ని తగ్గించడంలో ఈఓసీ సహాయం అందిస్తుంది.

 

 

జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో గత పది శాతాబ్దాల్లో దాదాపు 14 ‘సార్లు భూకంపాలు సంభవించాయి. 1962లో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సంభవించింది. 2013లో 5.7 తీవ్రతతో, 2017లో 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.