Bengaluru Earthquake : బెంగళూరులో భూకంపం.. ఉలిక్కిపడిన నగరవాసులు!

బెంగళూరులో భూకంపం సంభవించింది. కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనలతో నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు.

Bengaluru Earthquake : బెంగళూరులో భూకంపం.. ఉలిక్కిపడిన నగరవాసులు!

Earthquake Of 3.3 Magnitude Hits Bengaluru

Bengaluru Earthquake : బెంగళూరులో భూకంపం సంభవించింది. కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనలతో నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు. రికార్డు స్కేలుపై 3.3 భూకంప తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ముందుగా రికార్డు స్కేలుపై 3.1 గా నమోదైనప్పటికీ ఆ తర్వాత NNE భూకంప తీవ్రతను 3.3గా సవరించింది.

బెంగళూరు నార్త్, ఈశాన్య ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. చిక్‌బళ్లాపుర జిల్లాలో స్వల్పకాలం పాటు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 77.76 అడుగుల దూరంలో 23కిలోమీటర్ల లోతున, 66కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది.

ఈ మేరకు NNE ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సిటీలో భూకంప తీవ్రత తక్కువగా ఉండటం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని ప్రాథమిక రిపోర్టు తెలిపింది. భూ ఉపరితలం నుంచి 23 కిలోమీటర్ల లోతున కదలికల కారణంగానే ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది.


కర్ణాటకలో కొన్నిరోజులుగా వరుసగా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనాలు వస్తున్నాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతంలో భూకంప తీవ్రత కనిపిస్తోంది. 2021 అక్టోబర్‌లో బీదర్, కలబురగి, విజయపుర జిల్లాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3 నుంచి 4 వరకు రికార్డయ్యాయి.

Read Also : Scrub Typhus In HYD : హైదరాబాద్ లో వింత వ్యాధి..ఇళ్లల్లో ఉండే పురుగు వల్ల సోకుతున్న వ్యాధి