Election Commission : రాజకీయ పార్టీలకు ఈసీ షాక్.. హామీలివ్వడమే కాదు వాటిని ఎలా నెరవేరుస్తారో కూడా చెప్పాల్సిందే

రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా చేసిన ప్రతిపాదనలపైన 15 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది ఈసీ.

Election Commission : రాజకీయ పార్టీలకు ఈసీ షాక్.. హామీలివ్వడమే కాదు వాటిని ఎలా నెరవేరుస్తారో కూడా చెప్పాల్సిందే

Election Commission : రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా చేసిన ప్రతిపాదనలపైన 15 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది ఈసీ.

ఎన్నికలు వస్తే చాలు.. ప్రతి రాజకీయ పార్టీ పెద్ద సంఖ్యలో హామీలు ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. అవి చేస్తామని, ఇవి చేస్తామని, ఏవేవో ఉచితంగా ఇస్తామని చెబుతుంటాయి. వాటిలో డొల్ల హామీలూ ఎక్కువగానే ఉంటాయి. దీనిపై చాలా విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొల్ల, ఉచిత హామీల విషయంలో చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు తాజాగా లేఖ రాసింది.

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను నెరవేర్చేందుకు ఎంత డబ్బులు ఖర్చవుతాయి, ఆ నిధులను ఎలా సర్దుబాటు చేస్తారన్న వివరాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం పేర్కొంది.

‘‘దేశంలో రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే చేసే పనులపై హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలు విడుదల చేయడం వాటి హక్కు అన్న విషయాన్ని ఎన్నికల సంఘం కూడా అంగీకరిస్తోంది. అంత మాత్రాన అలవిమాలిన, అమలుకు వీలుకాని హామీలు ఇవ్వడాన్ని ఉపేక్షించదు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరి మధ్య సమాన పోటీ వాతావరణం ఉండాలి” అని లేఖలో స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. తాము ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు, ఎలా అమలు చేస్తారన్న అంశాలను అభ్యర్థులు, రాజకీయా పార్టీలు వెల్లడించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనపై అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 19వ తేదీలోగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఈసీ సూచించింది. వాస్తవంగా అమలు చేయగలిగిన హామీలు, వాగ్దానాలను మాత్రమే ఓటర్లు విశ్వసించాల్సి ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.