మీ దగ్గర పాత, చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లు ఉన్నాయా? గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

మీ దగ్గర పాత, చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లు ఉన్నాయా? గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

Exchange of torn currency made easy: మీ దగ్గర పాత, చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? వాటిని ఎలా, ఎక్కడ మార్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఆ నోట్లు ఇక వేస్ట్ అయినట్టే అని బాధపడుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. పాత, చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చే వార్త వినిపించింది. పాడైపోయిన నోట్ల మార్పిడి విషయంలో బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

 

ఏ బ్యాంక్‌కైనా వెళ్లి సులువుగానే మార్చుకోవచ్చు:
పాత, చిరిగిన నోట్లను మీ సమీపంలోని ఏ బ్యాంక్‌కైనా వెళ్లి సులువుగానే మార్చుకోవచ్చని, బదులుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని ఆర్బీఐ చెప్పింది. పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్‌ తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ నోట్లను తెచ్చినవారు తమ ఖాతాదారులా? కాదా? అన్నది చూడొద్దని బ్యాంకులకు తేల్చి చెప్పింది. అంతేకాదు, వారి దగ్గర నోట్ల మార్పిడికి ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Here is how you can claim a full refund of a 'Mutilated Currency Note' - FACTLY

తీవ్రంగా దెబ్బతిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న కరెన్సీని మార్చుకోవచ్చు:
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇటీవల పందుల వ్యాపారం చేసే వ్యక్తి డబ్బుని ట్రంక్ పెట్టెలో ఉంచగా, రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టి చెత్తకాగితాల్లా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తీవ్రంగా దెబ్బతిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ఆ నోట్లపై నెంబర్‌ మస్ట్:
అయితే సదరు నోట్లపై నెంబర్‌ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది. నిజానికి పాడైపోయిన నోట్లను కమీషన్‌ తీసుకుని బదులుగా ఇతర నోట్లను ఇచ్చే వ్యాపారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ దందా ఆర్బీఐ కార్యాలయాల సమీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఈ పాడైన నోట్లను బ్యాంకుల్లో, ఆర్బీఐ ఆఫీసుల్లోనే మార్చేస్తారని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.