కరోనా భయం మధ్య జంటకు డిజిటల్ విడాకులు!

  • Published By: srihari ,Published On : June 17, 2020 / 09:56 AM IST
కరోనా భయం మధ్య జంటకు డిజిటల్ విడాకులు!

కరోనా భయాల మధ్య ఓ జంటకు డిజిటల్ విడాకులు మంజూరయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సాధారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందాలంటే అడ్వకేట్లు చుట్టూ తిరిగాల్సి ఉండేది. కరోనా పుణ్యామని ఆ ఇబ్బంది తప్పింది. ఎవరైనా జంట విడిపోయేందుకు నిర్ణయించుకుంటే వారికి ఏడాది వరకు మళ్లీ కలిసి జీవించే అవకాశం ఉంటుంది.

ఆ ఏడాదిలో వారి నిర్ణయం మారకుండా విడివిడిగా జీవించినట్టయితే ఆయా జంటలు విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. 2017 మే నెలలో వివాహమైన జంట విభేదాలు తలెత్తడంతో ఏడాదికి పైగా విడివిడిగా ఉంటోంది. ఇటీవలే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా వేర్వేరుగా ఉంటున్న జంటలు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేయవచ్చనని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఉత్తర్వుల ఆధారంగా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్‌ 13B (2) కింద 2019లో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసింది ఈ జంట. వీరి విడాకుల పిటిషన్ ను  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం జంటకు విడాకులు మంజూరు చేసింది. 

Read: Zoomకు ధీటుగా Microsoft.. ఒకేసారి స్క్రీన్‌పై 49మందిని చూడొచ్చు