ఒడిశాలో ఫోనీ ఎఫెక్ట్ : నదులకు వరద ముప్పు 

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 03:43 AM IST
ఒడిశాలో ఫోనీ ఎఫెక్ట్ : నదులకు వరద ముప్పు 

ఫోనీ తుఫాను ఒడిశాఫై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫోనీ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వరద ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నదులకు సమీపంలో ఉన్న 217 గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. 
Also Read : ఫోని తుఫాన్ ప్రభావం : 50కి పైగా రైళ్లు రద్దు

కాగా  మే 3వ తేదీ మధ్యాహ్నాన్నానికల్లా ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపారు. ఈ ప్రభావంతో సముద్రంలోని కెరటాలు ఎగసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. 

ఫణి తుఫాన్‌ ప్రభావంతో ఈస్టుకోస్టు రైల్వే పరిధిలో పలు  రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పాసింజర్స్‌ ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ డీఆర్‌.పాల్‌ ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో (మే 2,3)ప్రచండ గాలులతో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల క్రమంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
Also Read : లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే