Farmers : 2018-19లో సాగు ద్వారా రైతులు రోజుకు రూ.27 సంపాదించారు!

2018-19 ఏడాదిలో ఒక భారతీయ రైతు సాగు ద్వారా సగటున రోజుకు సంపాదన 27.. అదే ఏడాది పొడవునా MGNREGS పథకం కింద పనిచేయడం ద్వారా సంపాదించిన దాని కంటే చాలా తక్కువ.

Farmers : 2018-19లో సాగు ద్వారా రైతులు రోజుకు రూ.27 సంపాదించారు!

Farmers Earned 27 A Day From Cultivation In 2018 19

Farmers earned 27 a day from cultivation : 2018-19 ఏడాదిలో ఒక భారతీయ రైతు సాగు ద్వారా సగటున రోజుకు ఎంత సంపాదించాడో తెలుసా? రూ.27.. అదే ఏడాది పొడవునా MGNREGS పథకం కింద పనిచేయడం ద్వారా సంపాదించిన దాని కంటే చాలా తక్కువ. అంటే.. మన భారతీయ వ్యవసాయంలో సాగు సంక్షోభం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతోంది. భారత్ ఆర్థిక విధానంలో వైఫల్యాలకు కారణం కూడా వ్యవసాయపరంగా అభివృద్ధిలేకపోవడమే.. వ్యవసాయేతర పనులకు రైతులను మరల్చలేకపోవడం.. ప్రత్యేకించి తయారీరంగంలో ఆర్థిక విధానంలో వైఫల్యాలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ ఉపాధిలో వాటా పెరిగిన గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఈ విషయం స్పష్టమైంది. తాజా పరిస్థితుల అంచనా సర్వే (SAS) ప్రకారం.. దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితులపై అత్యంత సమగ్రమైన అధికారిక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సెప్టెంబర్ 10న ప్రచురించింది.

2019 క్యాలెండర్ ఏడాదిలో SAS సర్వేను నిర్వహించింది. జూలై 2018 నుంచి జూన్ 2019 కాలానికి సంబంధించిన డేటాను సేకరించింది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన వైరుధ్యానికి దారితీసింది. దేశంలో వ్యవసాయం అతిపెద్ద ఉపాధిదారుగా ఉంది. 2018-19 సంబంధిత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం.. వ్యవసాయ ఉపాధి వాటాను 42.5శాతంగా ఉంది. పంటల సాగుతో సగటు భారతీయ రైతు లేదా వ్యవసాయ కుటుంబానికి అతిపెద్ద ఆదాయ వనరు ఎప్పటికీ కాదనే చెప్పాలి. రైతుల మొత్తం ఆదాయంలో సాగులో తగ్గుతున్న వాటా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయాన్ని అట్టుడగు స్థానంలోకి నెట్టివేసిందని నిపుణులు భావిస్తున్నారు.
Employees Transfer : తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏపీకి శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

గ్రామీణ వ్యవసాయంలో చిన్న వాటాలే కారణం :
గ్రామీణ భారతదేశంలో 93.1 మిలియన్ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయని గ్రామీణ సర్వే (SAS) అంచనా వేసింది. గ్రామీణ భారతదేశంలో మరో 79.3 మిలియన్ వ్యవసాయేతర గృహాలను కూడా చేర్చింది. వ్యవసాయ గృహరంగంలో లేదా ఉద్యాన పంటలు, పశువుల, లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఒక ఏడాదిలో 4,000 కంటే ఎక్కువగా స్వయం ఉపాధి పొందారు. అంటే.. దీని అర్థం భారతదేశ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి వ్యవసాయంలో కనీస ఆర్థిక వాటాలు కూడా లేవని తెలుస్తోంది. దాదాపు అన్ని వ్యవసాయేతర కుటుంబాలు (99శాతం) ఒక హెక్టార్ కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నాయి. వాటిలో దాదాపు సగం మందికి ప్రధాన ఆదాయ వనరు సాధారణ ఉపాధి ద్వారానే అందుతోంది. దాదాపు ఐదు వ్యవసాయేతర కుటుంబాలలో ఒకటి జీతభత్యాలతో జీవనం సాగిస్తోంది.

క్షీణించిన సాగు ప్రాముఖ్యత :
పంట సాగు, జంతువుల పెంపకంలో స్వయం ఉపాధి కలిగిన 93.1 మిలియన్ వ్యవసాయ కుటుంబాలలో 71శాతం మందికి అతిపెద్ద ఆదాయ వనరుగా నిలిచింది. సగటు వ్యవసాయ కుటుంబం మొత్తం ఆదాయంలో వేతనం (40శాతం) కంటే సాగు (38శాతం) ద్వారా చిన్న మొత్తాన్ని సంపాదించింది. సాగు ప్రాముఖ్యత క్షీణించడంతో రైతుల ఆదాయాలు తగ్గిపోయాయి. జూలై 2012 నుంచి జూన్ 2013 కాలానికి సంబంధించిన డేటాను సేకరించగా.. మొత్తం ఆదాయంలో సాగు ద్వారా వచ్చే ఆదాయంలో వాటా 48శాతంగా నమోదైంది.
Afghan Police Back : తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపు..డ్యూటీలో చేరిన అఫ్గాన్ పోలీసులు

MGNREGS కార్మికుల సంపాదనే ఎక్కువ :
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా వ్యవయసేతర పనులు చేసే కార్మికులకు ఎంతో చేయూతనిచ్చింది. వంద రోజుల పాటు ఉపాధిని పొందవచ్చు. MGNREGS అందించే వేతనాలు ఇతర వేతనాలతో సమానంగా ఉంటాయి. పని ఎక్కడా దొరకని వారు మాత్రమే MGNREGS ఉపాధిని ఎంచుకుంటారు. MGNREGS ఉపాధిపొందేవారంతా పేదవారిగా భావిస్తారు. ఐదు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సాగు ద్వారా వచ్చే సగటు ఆదాయం MGNREGS 365 రోజుల్లో చెల్లించే మొత్తానికి కంటే చాలా తక్కువగా ఉందని SAS సర్వే వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా ప్రతి నెలా MGNREGS కింద సగటు వేతనం స్కీమ్ పబ్లిక్ డేటా పోర్టల్ నుంచి అందుతుంది. SG నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. జూలై 2018-జూన్ 2019 కాలంలో మొత్తం 365 రోజులూ పనిచేసిన MGNREGS కార్మికుడి వార్షిక ఆదాయాలను లెక్కించవచ్చు. 28 రాష్ట్రాలలో 23 రాష్ట్రాల నుంచి MGNREGS కింద సంపాదన.. వ్యవసాయ కుటుంబానికి సాగు ద్వారా వచ్చే వార్షిక సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. జార్ఖండ్, ఒడిశాలోని వ్యవసాయ కుటుంబ మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. వ్యవసాయ కుటుంబానికి సాగు ద్వారా సగటు వార్షిక ఆదాయం 365 రోజుల్లో 0.7 రెట్లు MGNREGS వేతనం ఉంటుందని నివేదిక తెలిపింది.
Mercedes : ఈ స్మార్ట్ కారును మీ మైండ్‌తో కంట్రోల్ చేయొచ్చు.. మీరేమనుకుంటే అదే చేస్తుంది!