Haryana – UP border : రైతు ఐడియా అదిరింది..బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్

దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్‌ను బుల్లెట్‌​ ప్రూఫ్‌గా మార్చాడు.

Haryana – UP border : రైతు ఐడియా అదిరింది..బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్

Haryana-UP border

Bullet Proof Tractors : దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్‌ను బుల్లెట్‌​ ప్రూఫ్‌గా మార్చాడు. ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడేందుకు తన వాహనాన్ని ఇలా తీర్చిదిద్దుకున్నానన్నాడు రాజేశ్‌.

ఉత్తర్​ప్రదేశ్​, హర్యానా మధ్య ఎప్పటి నుంచో జలవివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా చాలా సార్లు ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సమస్య నుంచి బయట పడడానికి డిఫరెంట్‌గా ఆలోచించాడు రాజేశ్‌. 5లక్షల ఖర్చు చేసి తన ట్రాక్టర్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చేశాడు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేశానని రైతు రాజేంద్ర చెప్పాడు.

ఈ సమస్య నుంచి తనను తాను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌ను బుల్లెట్​ ప్రూఫ్ చేయించానన్నాడు. ఇప్పుడు తమ ప్రాంతంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారని రాజేశ్‌ వెల్లడించారు. గత వారం తన సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని… కాల్పులు కూడా జరిపారని తెలిపాడు ఆ రైతు. అయితే ఆ సమయంలో ఈ ట్రాక్టర్​ కారణంగా తాము సురక్షితంగా బయటపడ్డామన్నాడు రాజేశ్‌.