మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : November 19, 2020 / 03:08 PM IST
మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండా దొరికితే రూ.2000 జరిమానా కట్టాల్సిందేనని కేజ్రీవాల్ ప్రకటించారు.



అదేవిధంగా, అన్ని రాజకీయ పార్టీలు,సామాజిక సంస్థలు ఢిల్లీలోని అన్ని పబ్లిక్ ప్లేస్ లలో మాస్క్ ల పంపిణీ చేపట్టాల్సిందిగా కేజ్రీవాల్ విజ్ణప్తి చేశారు. ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని,దయచేసి అందరూ మాస్క్ లు ధరించాలని,భద్రతా నిబంధనలు పాటించాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.



మరోవైపు, కారులో సింగిల్ గా ఉన్నా..మాస్క్ పెట్టుకోవాల్సిందేనని బుధవారం ఢిల్లీ హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బహిరంగ ప్రదేశాలతో పాటు కారులో ఒక్కరు ఉన్నా..తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వెల్లడింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకోలేదని తనకు రూ. 500 ఫైన్ వేశారని, నిబంధనలకు ఇది వ్యతిరేకమంటూ న్యాయవాది సౌరభ్ శర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా…బహిరంగ ప్రదేశంలో, పని చేస్తున్న సమయంలో మాస్క్ ధరించాలని DDMA మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయని కోర్టు దృష్టికి ఆప్తీసుకొచ్చింది.



https://10tv.in/delhi-women-conistable-who-trace-76-missing-children-from-several-states-gets-rare-pramotion/
కాగా,ఇప్పటికే ఢిల్లీలోని మార్కెట్లను మూసివేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ హాట్ స్పాట్ లుగా మార్కెట్లు మారిపోతున్నాయని, ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు మార్కెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాకుండా, సాంప్రదాయ ఛాత్ పూజ సమయంలో ఒకేసారి నదిలో పుణ్యస్నానాలకు తాము అనుమతివ్వబోమని కేజ్రీవాల్ తెలిపారు. పుణ్యస్నానమాచరించే సమయంలో ఏ ఒక్కరికి వైరస్ పాజిటివ్ ఉన్నా వాటర్ లోకి వైరస్ వచ్చి,ఆ తర్వాత అందరికీ సోకే ప్రమాదముందని కేజ్రీవాల్ తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5లక్షలు దాటిపోగా,మరణాల సంఖ్య 8వేలు దాటింది.