నేడు భారత్ కు బోయింగ్ 777…ఇకపై వీవీఐపీల ప్రయాణాలు అందులోనే

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2020 / 03:28 PM IST
నేడు భారత్ కు బోయింగ్ 777…ఇకపై వీవీఐపీల ప్రయాణాలు అందులోనే

First modified Boeing 777 aircraft రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం భారత్​ చేరనుంది. ఎయిర్​ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి ఈ విమానాన్ని భారత్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమానంలో అధునాతన భద్రతా పరికరాలను అమర్చారు. వీవీఐపీల కోసం వినియోగించే మరో బీ777 విమాన త్వరలోనే భారత్​ చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలను ముందుగా ఈ ఏడాది జులైలోనే అందించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలు వాయిదా పడినట్లు చెప్పారు.


ప్రముఖుల ప్రయాణాల్లో ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్​ ఇండియా పైలట్లు కాకుండా వాయుసేన పైలట్లు నడుపుతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు.. ఎయిర్​ ఇండియాకు చెందిన బీ747 విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వీటిని ఎయిర్​ ఇండియా పైలట్లు ఆపరేట్​ చేస్తున్నారు. బీ777 విమానాలు అందుబాటులోకి వచ్చాక బీ747లను ఎయిర్​ ఇండియాలో కమర్షియల్​ ఆపరేషన్స్​ కోసం వినియోగించనున్నారు.



కొత్త విమానాలను 2018లో కొన్ని నెలల పాటు ఎయిర్​ ఇండియాలో వినియోగించారు. తర్వాత వీవీఐపీల ప్రయాణాల కోసం ఆధునిక భద్రత పరికరాలు బిగించేందుకు బోయింగ్​ సంస్థకు పంపించారు. ఇందులో క్షిపణి రక్షణ వ్యవస్థ…ఎల్​ఏఐఆర్​సీఎం, వ్యక్తిగత రక్షణ సూట్స్​ ఉన్నాయి.