45 ఏళ్ల తర్వాత చైనా సరిహద్దుల్లో పేలిన తూటా

10TV Telugu News

భారత్, చైనా సరిహద్దులలో డ్రాగన్ పెట్రేగిపోతోంది.. నిబంధనలను తొంగలో తొక్కినా భారత్ తిరిగి ఎదురు ప్రశ్నించడకూడదనే ధోరణితోనే హద్దు మీరుతోంది. తప్పు అని తెలిసినా కూడా కవ్వింపు చర్యలతో భారత బలగాలను రెచ్చగొడుతోంది.. డ్రాగన్ జిత్తులమారి వేషాలను భారత్ పసిగడుతోంది..చైనా ఆర్మీ బెదిరించినా కూడా భారత్ బలగాలు బెదరకుండా అలానే నిలవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు చైనాకు.. ప్రశాంతంగా ఉండాల్సిన వాస్తవాదీన రేఖను ణరంగంగా మార్చాలని చూస్తోంది.. ఎన్నడూ లేనివిధంగా తుపాకుల మోత వినిపించింది.. సుమారు 45ఏళ్ల తర్వాత సోమవారం రాత్రి తుపాకుల కాల్పులు వినిపించాయి.. డ్రాగన్ చర్యతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భారత్-చైనాల సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందానికి డ్రాగన్ తూట్లు పొడిచింది.
https://10tv.in/major-blow-to-china-another-blow-to-china-as-japan-adds-india-bangladesh-to-relocation-subsidiary/
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆరోపణలను తిరస్కరించడంతో చైనా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయని భారత ఆర్మీ వెల్లడించింది. అందుకే ఒక రోజు ముందే తూర్పు లడఖ్ లోని ఒక భారతీయ స్థానాన్ని మూసివేయాలని ప్రయత్నించినట్టు ఆర్మీ వెల్లడించింది.వాస్తవ నియంత్రణ రేఖ (LAC) అంతటా సైన్యం అతిక్రమించింది. తూర్పు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు సమీపంలో భారత దళాలు ఎల్‌ఐసిని దాటి దారుణంగా కాల్పులు జరిపాయని పిఎల్‌ఎ సోమవారం రాత్రి ఆరోపించింది. ఆ తరువాత భారత ఆర్మీ ఈ వ్యాఖ్యలు చేసింది.

1975లో చివరి సారిగా తుపాకులు వినియోగించిందీ చైనా సైన్యమే.. పీఎల్ఏకు చెందిన కొందరు తులుంగ్లా వద్ద భారత్ అధీనంలోని భూభాగంలోకి చొరబడ్డారు. అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్-చైనాల సరిహద్దు వద్ద శాంతిని పునరుద్ధరించడానికి చాలా ఒప్పందాలు జరిగాయి.వీటిలో 1996లో జరిగిన ఓ ఒప్పందంలో ఇరుపక్షాలు కాల్పులు జరపకూడదని తీర్మానించాయి.. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల వరకు జీవ, రసాయన ఆయుధాల వినియోగం, పేలుడు కార్యకలాపాలు జరపడం, తుపాకులతో లేదా పేలుళ్ల సాయంతో వేటాడం నిషేధించారు. పాంగాంగ్ సరస్సు వద్ద జరిగిన ఘటనతో చైనా ఈ ఒప్పందానికి తూట్లు పొడిచింది.