మండువేసవిలోనూ వణుకుతున్న అస్సోం: ఒకవైపు కరోనా..మరోవైపు వరదలు 

  • Published By: nagamani ,Published On : May 26, 2020 / 06:55 AM IST
మండువేసవిలోనూ వణుకుతున్న అస్సోం: ఒకవైపు కరోనా..మరోవైపు వరదలు 

ఒకవైపు కరోనా..మరోవైపు మండు వేసవిలో కూడా అస్సోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. శనివారం (మే 23,2020)  నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి.

అకాలవర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు 10,000 మందికి పైగా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తెలిపింది. అసోంలోని లఖింపూర్, సోనిత్పూర్, దరాంగ్, గోల్పారా జిల్లాల్లోని 46 గ్రామాలకు చెందిన 10,801 మంది ప్రజలు వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ అధికారి తెలిపారు.

వరద ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సర్బానంద సోనోవాల్ ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వరదలను ఎదుర్కోవటానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది అధికార యంత్రాంగం. కానీ కరోనా కష్టాల్లో ఉన్న సమయంలోనే వరదలు ముంచెత్తటంతో రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో మొత్తం 514 కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి మట్టం గంట గంటకు పెరుగుతోందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సభ్యుడు శరత్‌చంద్రా కలిత తెలిపారు. కాగా, అసోంలో తాజాగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌-19 కేసుల సంఖ్య 514కు చేరుకుంది. కరోనా బారి నుంచి 62 మంది కోలుకోగా, 445 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ సోకి ఇప్పటివరకు అసోంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర మంత్రి హిమంతబిశ్వా శర్మ సోమవారం తెలిపారు

కాగా..భారత్ లో 1 లక్షా 45 వేల 380 కేసులు కరోనా కేసులు నమోదు కాగా..ఇప్పటి వరకూ మొత్తం 4వేల 167మంది కరోనాకు బలైపోయారు.  దేశ వ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కరోనా కేసులు 80వేల 722కాగా..60వేల 419మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.    

Read: నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్, 14 అడుగులున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు