Amarinder Singh : రాష్ట్రంలో మరో కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తుపై మాజీ ముఖ్యమంత్రి కీలక ప్రకటన

కొత్త పార్టీ ఏర్పాటు, బీజేపీతో పొత్తుపై మాజీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఊహాగానాలకు తెరదించుతూ త్వరలోనే సొంతంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు...

Amarinder Singh : రాష్ట్రంలో మరో కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తుపై మాజీ ముఖ్యమంత్రి కీలక ప్రకటన

Amarinder Singh

Amarinder Singh : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటు, బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. ఊహాగానాలకు తెరదించుతూ త్వరలోనే సొంతంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. అంతేకాదు బీజేపీతో పొత్తు అవకాశంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని, రైతుల సమస్యలు కనుక పరిష్కరిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తాను రెడీ అని చెప్పారు. 2022 పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి సీట్లు పంచుకుంటానని వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దూతో విభేదాల కారణంగా అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

”పంజాబ్ భవిష్యత్తు కోసం యుద్ధం జరుగుతోంది. పంజాబ్ మరియు దాని ప్రజల ప్రయోజనాల కోసం నా సొంత రాజకీయ పార్టీని త్వరలోనే ప్రారంభిస్తా. అలాగే తమ మనుగడ కోసం ఏడాది కాలంగా పోరాడుతున్న మన రైతులతో సహా,” అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

“రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రైతుల నిరసన పరిష్కారమైతే, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో సీట్ల ఏర్పాటుపై ఆశలు పెట్టుకున్నాము. అలాగే విడిపోయిన అకాలీ గ్రూపులు, ప్రత్యేకించి ఢిండ్సా మరియు బ్రహ్మపుర వర్గాల వంటి సారూప్య పార్టీలతో కూడా పొత్తు గురించి ఆలోచన చేస్తున్నాం ” అని ఆయన చెప్పారు.

సెప్టెంబర్ 18 న కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ మధ్య నెల రోజుల అంతర్గత పోరు నడించింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సీఎం పదవిని వదులుకున్నారు. ఆ వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారని జోరుగా ఊహానాగాలు వినిపించాయి. అమరీందర్ సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవడం, ఆయనతో సుదీర్ఘంగా భేటీ కావడం.. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న ఊహాగానాలను అమరీందర్ తోసిపుచ్చారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరేందుకే తాను అమిత్ షా ని కలిసినట్టు వివరించారు.