Raghuram Rajan : దేశ ద్రవ్యోల్బణంపై రఘురామ్‌ రాజన్‌ కీలక వ్యాఖ్యలు

కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్‌ మైలేజ్‌ కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని దేశద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ రఘురాం రాజన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Raghuram Rajan : దేశ ద్రవ్యోల్బణంపై రఘురామ్‌ రాజన్‌ కీలక వ్యాఖ్యలు

Raghuram Rajan

Raghuram Rajan : దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం సర్వ సాధారణంగా జరిగే నిర్ణయమన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగే చేస్తాయని వివరించారు.

ఇవాళ కాకపోతే రేపయినా వడ్డీ రేట్లు పెంచడం తప్పదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్‌ మైలేజ్‌ కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని దేశద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ రఘురాం రాజన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Indian military: రష్యా, యూకేల కంటే ముందంజలో భారత్.. 23వ స్థానంలో పాకిస్థాన్ ..

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇక యుక్రెయిన్‌- రష్యా యుద్ధం రావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. దీంతో మార్చిలో చిల్లర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 6.95 శాతానికి చేరగా టోకు ద్రవ్యోల్బణం 14.55ని టచ్‌ చేసింది.

అయితే ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపునకు సుముఖంగా లేదు. దీంతో పలు బ్యాంకులు నేరుగా కాకపోయినా పరోక్ష పద్దతిలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల వడ్డీ రేట్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను ఉద్దేశించి రఘురాం రాజన్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.