TN Assembly Election : ఎన్నికల సిత్రాలు, అభ్యర్థుల పాట్లు..ఒకరు బట్టలు ఉతుకుతుంటే..మరొకరు కూరగాయలు అమ్ముతున్నారు

ఎన్నికలు వచ్చాయంటే..చాలు..అభ్యర్థులు విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు.

TN Assembly Election : ఎన్నికల సిత్రాలు, అభ్యర్థుల పాట్లు..ఒకరు బట్టలు ఉతుకుతుంటే..మరొకరు కూరగాయలు అమ్ముతున్నారు

Election

campaign methods : ఎన్నికలు వచ్చాయంటే..చాలు..అభ్యర్థులు విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. జనాలను అట్రాక్షన్ చేసేందుకు వారి ఇంటి పనుల నుంచి సొంత పనుల వరకు ఏదైనా చేస్తారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఒకరు ఇంట్లో వంట చేస్తుంటే..మరొకరు మేమున్నాం..మీరు జరగండి అంటూ బట్టలు ఉతికి పెడుతున్నారు. మరొకరు కూరగాయలను విక్రయిస్తున్నారు. ఓట్ల కోసం తమిళనాట నాయకుల ఆరాటం ఆసక్తి రేపుతోంది. ఏఐఏడీఎంకే పార్టీ రాయపురం అభ్యర్థి డీ జయకుమార్ ఓ మహిళకు కష్టమైందని రోడ్డు పక్కన ఉన్న చేతి పంపును స్వయంగా ఆయనే కొట్టి ఆమెకు సాయం చేశారు. అంతేకాకుండా కొన్ని ప్రదేశాల్లో ఆటో నడిపి వినూత్నంగా ఓట్లు అడిగారు ఈ మాజీ మంత్రి.

ఏఐఏడీంఎకే నాగపట్నం నుంచి కత్తివరన్ బరిలో నిలుచున్నారు. నాగోర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో…ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. వెంటనే అమ్మా..తప్పుకో..నేను ఉతికి పెడుతానంటూ..ఆమె చేతిలో ఉన్న బట్టలను స్వయంగా ఉతికి పెట్టారు. ప్రతి ఇంటికి వాషింగ్ మిషన్ అందచేస్తానని హామీనిచ్చారు. రెండు ఆకుల గుర్తుకు ఓటేసి గెలిపించాలని చివరిలో కోరారు.
ఏఐడీఎంకే పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న అమ్మ మక్కల్ మున్నేట్రా కజగం అధినేత టీటీవీ దినకరన్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. దివంగత కరుణానిధి గొంతుకను అనుకరిస్తూ…ఓట్లను అభ్యర్థించారు. ప్రతి మహిళకు రూ. 1000 అందచేస్తామని మిమిక్రీ చేశారు.

ఇక చెన్నై మాజీ మేయర్ ఏఐఏడీఎంకే అభ్యర్థి సైదాయ్ దురై సామి టీ దుకాణానికి వెళ్లారు. అక్కడ టీ తయారు చేసి విక్రయించారు. నటి, బీజేపీ అభ్యర్థి ఖుష్బూ ఓటర్ ఇంటికి వెళ్లి..స్వయంగా..టీ కాచారు. విరుగాంబకం డీఎంకే క్యాండిడేట్ ఎంవీఎం ప్రభాకర్ టిఫిన్ దుకాణానికి వెళ్లి..వేడి వేడి దోశలు వేసి..ఎలా ఉందో చెప్పండి అంటూ..కస్టమర్లను కోరారు. కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీకి చెందిన ఎగ్మోర్ నియోజక వర్గం అభ్యర్థి ప్రియదర్శిని నోరూరించే చేపల వేపుడును తయారు చేసి ఓటు వేయాలని అడిగారు. తోండాముత్తుర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ వైవిధ్యంగా ప్రచారం చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి అమ్మేందుకు ప్రయత్నించారు. మొత్తానికి అభ్యర్థుల పాట్లను చూస్తున్న జనం..నోరెళ్లబెడుతున్నారు. ఏప్రిల్ 15న తమిళనాడు ఎన్నికల పోలింగ్ జరగనుంది.