పుర్రెకో బుద్ధి : గాడిదపై ఊరేగుతు నామినేషన్ 

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 04:56 AM IST
పుర్రెకో బుద్ధి : గాడిదపై ఊరేగుతు నామినేషన్ 

దేశ వ్యాప్తంగా పలు విడతలుగా కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల క్రమంలో పలు చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న  అభ్యర్థులు విభిన్న పద్ధతుల్లో నామినేషన్ వేస్తున్నారు. ఓ అభ్యర్థి పెళ్లి కుమారుడు వేషధారణతో వెళ్లి నామినేషన్  వేయగా..ఇప్పుడు తాజాగా మరో విచిత్ర పద్ధతులో నామినేషన్ వేసిన అభ్యర్థి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాడు. 
Also Read : చంద్రయాన్-2: సెప్టెంబర్ 6న చంద్రునిపైకి!

గాడిదపై ఊరేగుతు వెళ్లి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి స్థానికంగా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనే మణిభూషణ్‌శర్మ(44). బీహార్‌లోని జెహానాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు మణిభూషణ్శర్మ. తనకంటు ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నాడో ఏమో  వెరైటీగా  గాడిదపై కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లాడు. ప్రధాన పార్టీల నేతలు సామాన్యులను గాడిదలుగా పరిగణిస్తున్నారని..అందుకే ఇలా గాడితపై ఊరేగుతు వెళ్లానని  శర్మ తెలిపారు. కాగా శర్మ గాడిపై ఊరేగటం  వివాదమైంది. జంతు ప్రేమికులు మణిభూషణ్ శర్మపై జంతు హింస నిరోధక చట్టం కింద అతనిపై కేసు పెట్టారు.
Also Read : వింత దూడ : చాప..దిండు ఉన్న చోటే నిద్ర