వింత దూడ : చాప..దిండు ఉన్న చోటే నిద్ర

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 03:39 AM IST
వింత దూడ : చాప..దిండు ఉన్న చోటే నిద్ర

ఓ దూడ వింత వింతగా ప్రవర్తిస్తోంది. మనిషిలాగే వ్యవహరిస్తుండడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఇది చోటు చేసుకుంది. వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు ఆవు ఉంది. ఈ ఆవు ఇటీవలే మగ దూడకు జన్మనిచ్చింది. దీనికి వేలన్ అనే పేరు పెట్టారు. రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి చాప..దిండు ఉన్న చోట నిద్రిస్తోంది.

అంతే కాదు..ఇంట్లో నీళ్లు తాగడం..చిన్న పిల్లలకు తినే స్నాక్స్ ఐటమ్స్ కూడా తినేస్తోంది. దీనిని చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. కుటుంబసభ్యులు కూడా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్, పాటలు వినేందుకు టేప్ రికార్డర్, స్పీకర్లు ఏర్పాటు చేశారు. సినిమా పాటలకు దూడ డ్యాన్స్ చేస్తోంది. ఆకలి వేసినప్పుడు తల్లి ఆవు వద్దకు వెళుతోంది. 
Also Read : చిల్లర రాజకీయాలు : లక్ష్మీస్ NTR మూవీపై ఫస్ట్ టైం స్పందించిన చంద్రబాబు