ఫ్రీ చికెన్ మేళా…జనసంద్రమైన రోడ్లు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 12:33 PM IST
ఫ్రీ చికెన్ మేళా…జనసంద్రమైన రోడ్లు

కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ దెబ్బకు కోడి మాంసం అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి.

దేశవ్యాప్తంగా వారానికి సగటున 7.5 కోట్ల కోళ్ల అమ్మకాలు జరుగుతుండగా.. ప్రస్తుతం 3.5 కోట్ల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీల్లో కోడి ధర 70% వరకు పతనమైంది. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. వివాహాది శుభకార్యాల్లోనూ కోడి మాంసం వినియోగించడానికి పలువురు సంశయిస్తున్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీపై ఇది పెను ప్రభావం చూపుతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. 

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పౌల్ట్రీ ఫార్మ్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్న అపోహలను తొలగించేందుకు శనివారం(ఫిబ్రవరి-29,2020) గోరఖ్ పూర్ లో చికెన్ మేళా నిర్వహించింది. చికెన్ డిషెస్ ను ప్లేట్ రూ.30కే అందించింది.

ఇక ఇంత తక్కు వ రేటుకే చికెన్ వెరైటీలు వస్తుంటే నాన్ వెజ్ ప్రియులు ఊరుకుంటారా మరి. చికెన్ మేళాకు ఎగబడ్డారు. మేళా కేజీల చికెన్ ను మేళా ద్వారా ప్రజలు రుచి చూశారు. గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ చికెన్ మేళా జరగింది. జనం తండోప తండాలుగా మేళాకు రావడంతో రైల్వే స్టేషన్ కు వచ్చే రోడ్లన్నీ గంటల పాటు బ్లాక్ అయ్యాయి. రైల్వే స్టేషన్ ఏరియా జనసంద్రోహమయింది.