Covaxin Production : గుజరాత్ లో కోవాగ్జిన్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి

త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.

Covaxin Production : గుజరాత్ లో కోవాగ్జిన్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి

Covaxine

Covaxin Production త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది. ఇందులో భాగంగా హైదారాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి మరో కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. గుజ‌రాత్‌లోని అంక‌లేశ్వర్‌లో కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఇవాళ తెలిపారు.

కాగా, కోవిడ్ టీకాల పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ..ఇప్పటివరకు హైద‌రాబాద్ యూనిట్ నుంచి మాత్రమే కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ అనుమతితో ఇక నుంచి అంకలేశ్వర్ యూనిట్ నుంచి కూడా కోవాగ్జిన్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇక, జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు 7 కోట్ల కోవాగ్జిన్ డోసుల‌ను ఉత్పత్తి చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిపై కోవాగ్జిన్ టీకా సామ‌ర్థ్యం 77.8 శాతంగా ఉంది. డెల్టా వేరియంట్‌‌ కు వ్యతిరేకంగా కోవాగ్జిన్ 65.62 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ అధ్యయనంలో తేలింది.