Daughter : అమ్మాయి పుట్టడంతో ఆనందపడుతున్న కుటుంబం..పసిపాపను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన తండ్రి

కారులో పాపను తీసుకురావడం కామన్ అనుకున్న విశాల్ జరేకర్.. ప్రత్యేక హెలికాప్టర్ ఎరేంజ్ చేశారు. అందంగా ముస్తాబుచేసిన పసిపాపను.. హెలికాప్టర్‌లో తీసుకొచ్చారు.

Daughter : అమ్మాయి పుట్టడంతో ఆనందపడుతున్న కుటుంబం..పసిపాపను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన తండ్రి

Baby Helicopter

Grand welcome to daughter : అమ్మాయా.. అబ్బాయా.. తల్లికి డెలివరీ కాగానే అందరి నోటి నుంచీ వచ్చే ప్రశ్న ఇది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కుటుంబాలయితే.. అమ్మాయన్న మాట వినగానే..ఓ చిన్న పెదవి విరుపు కనిపిస్తుంది. గ్రామాలు, అభివృద్ధి మాట ఎరుగని తండాలు, మారుమూల ప్రాంతాల్లో అయితే.. అమ్మాయి పుట్టిందన్న మాటనే అపప్రదగా భావిస్తారు. అబ్బాయి పుట్టాలని కోరుకుంటే.. కూతురు జన్మించిందని తెగ బాధపడిపోతారు. పాప పెనుభారమవుతుందని ఆవేదన చెందుతారు..గ్రామాల నుంచి నగరాల దాకా.. సాధారణ ప్రజల నుంచి ఉన్నత కుటుంబాల దాకా.. ఇలా ఎవరిని గమనించినా.. అమ్మాయి పుట్టిందని అసంతృప్తితో ఉంటారు.

అందరూ ఇలా కాకపోయినా.. ఇలాంటివారు సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎంత అభివృద్ధి చెందినా.. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. పురుషులతో సమానంగా రాణిస్తున్నా, విద్యా, ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమదైన ముద్ర వేస్తున్నా.. అమ్మాయంటే ఉన్న ఈ చిన్నచూపు మాత్రం పోలేదు. ఇప్పటికీ పుత్రుడు పున్నామనరకం నుంచి తప్పిస్తాడన్న భ్రమల్లో ఉండేవాళ్లెందరో. కానీ పూణెకు చెందిన ఓ కుటంబం మాత్రం.. అమ్మాయిని అపురూపంగా భావిస్తోంది. కూతురు పుట్టిందన్న కల నెరవేరిందన్న సంతోషంతో ఉబ్బితబ్బిబవుతోంది.

Bhopal : ఆడపిల్ల పుట్టిందని పానీపూరి వ్యాపారి ఏం చేశాడో తెలుసా ? మెచ్చుకుంటారు

అమ్మానాన్నలే కాదు.. మొత్తం కుటుంబం అంతా ఆడపిల్లను చూసి ఆనందంలో మునిగితేలుతోంది. అంతేకాదు…అమ్మాయి పుట్టిందన్న సంతోషాన్ని వారు వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పసిపాపకు హెలికాప్టర్‌తో స్వాగతం చెప్పారు. రావమ్మా.. మహాలక్ష్మీ అని ఆహ్వానించారు. పుణెకు చెందిన విశాల్ జరేకర్‌ దంపతులకు కూతురు జన్మించింది. ఆ కుటుంబం మొత్తంలో ఎవరికీ అమ్మాయి లేదు. విశాల్ జరేకర్‌ కూతురే ఆ ఇంటి మహాలక్ష్మి. అందుకే కూతురుని తమ ఇంటికి ఆహ్వానించేందుకు కొత్త పద్ధతి ఎంచుకున్నారు.

కారులో పాపను తీసుకురావడం కామన్ అనుకున్న విశాల్ జరేకర్.. ప్రత్యేక హెలికాప్టర్ ఎరేంజ్ చేశారు. అందంగా ముస్తాబుచేసిన పసిపాపను.. హెలికాప్టర్‌లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లారు. తమ కుటుంబంలో ఎవరికీ అమ్మాయి లేదని, అందుకే తన కూతురు ఇంటికిరావడం మధురమైన ఘటనగా మలిచేందుకు హెలికాప్టర్‌తో వెల్‌కమ్ చెప్పామని విశాల్ జరేకర్ తెలిపారు. లక్ష రూపాయల ఖర్చుతో చాపర్‌లో పాపను తీసుకొచ్చామని తెలిపారు.