Harsh Goenka : మాస్క్ పెట్టుకోని వారిని బాదుతున్న రోబో..వీడియో వైరల్

ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

Harsh Goenka : మాస్క్ పెట్టుకోని వారిని బాదుతున్న రోబో..వీడియో వైరల్

Mask

Robots Enforcing Covid-19 : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. కోవిడ్ నిబంధనలు పాటించండి..మాస్క్ పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా..కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా..ఎంతో మంది విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై వివరిస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీలు సైతం కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు.

తాజాగా..ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

ఇక వీడియో సంగతి విషయానికి వస్తే..రోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దగ్గరకు ఓ రోబో వచ్చింది. ఆ సమయంలో అతను మాస్క్ పెట్టుకోలేదు. వెంటనే రోబో ముందటి భాగం పైకి లేచి..ముఖానికి లైట్ వేసింది. వెంటనే అతను జేబులో చేయిపెట్టగా..మాస్క్ లేదు. దీంతో ఆ రాబోనే వెనుకభాగంలో అమర్చిన మెడికల్ డబ్బా నుంచి మాస్క్ తీసి ఇచ్చింది.

ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకోగా..మరో వ్యక్తి పెట్టుకోలేదు. వెంటనే వచ్చిన రోబో..ఆ రెండో వ్యక్తిని అడ్డగించింది. ముందుకు పోనియ్యలేదు. ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి రోబోను తన్నాడు. వెంటనే ఆ రోబో..వ్యాక్సిన్ తీయడం కనిపించింది.

మరో ప్రాంతం వద్ద ఓ రోబో నిలబడి ఉంది. వచ్చిపోయే వారిని గమనిస్తోంది. మాస్క్ పెట్టుకోని వ్యక్తిని ముందుకు పోనియ్యకుండా..రెండు రోబోలు అడ్డుకున్నాయి. మరో ప్రాంతంలో కూడా ఇలాగే చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా ముందుకు వెళుతున్న వ్యక్తిపై అమాంతం సుత్తెలాంటి ఆకారంతో ఉన్న వస్తువుతో తలపై బాదింది రోబో. వెంటనే అతను మాస్క్ పెట్టుకని ముందుకు కదిలాడు. ఇంటి వద్దకు వచ్చిన రోబో..ఏకంగా వ్యాక్సిన్ కూడా వేసింది.

సూపర్ మార్కెట్ లో ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోకపోవడంతో బాక్సింగ్ ఆడే సమయంలో ఉపయోగించే గ్లవ్స్ ఆకారంలో ఉన్న రోబో అడ్డుకుంది. వెంటనే అతేను పెట్టుకుని ముందుకు కదిలాడు. బయటకు రాగానే…మాస్క్ తీసేశాడు. వెంటనే ఓ పంచ్ ఇచ్చింది రోబో. వ్యాపార వేత్త హర్ష్ గోయెంకా చేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.