Song On Vaccination : 100 కోట్లమందికి వ్యాక్సిన్ పై ప్రత్యేక గీతం,ఏవీ విడుదల

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు.

Song On Vaccination : 100 కోట్లమందికి వ్యాక్సిన్ పై ప్రత్యేక గీతం,ఏవీ విడుదల

Vaccine2

COVID Vaccine Milestone దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు. గురువారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు.

వ్యాక్సినేషన్​కు సహకరించిన వారికి శతకోటి వందనాలు అంటూ పాడిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ‘టీకే​ సే బచా హై దేశ్’ అంటూ సాగే ఈ పాటను..ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్ ఆలపించారు. 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్ ఘనత సాధించి భారత్ చరిత్ర సృష్టించిందని మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. స్వయం సమృద్ధ భారతదేశానికి ఇది దీపావళి పండగ వంటిదన్నారు.

కాగా, ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. గురువారం నాటికి వంద కోట్ల వ్యాక్సిన్లు దేశ ప్రజలు పొందారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల లోపల, రైల్వే స్టేషన్లు, రైళ్ల లోపల, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో వంద కోట్ల టీకా మార్క్ గురించి ప్రకటనలు చేశారు. దేశం గర్వించే ఈ ఘనత సాకారం కావడానికి తోడ్పడిన శాస్త్రవేత్తలు, వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్ లో వంద కోట్ల టీకా మార్క్‌ను అట్టహాసంగా జరిపారు. హాస్పిటల్ లో ప్రధాన బ్లాకులను పూలతో అందంగా అలంకరించారు. పువ్వుల ముగ్గులతోపాటు 100 కోట్ల వ్యాక్సినేషన్‌ అని తీర్చిదిద్దారు. భారత్‌ 100 కోట్ల కోవిడ్ -19 టీకా మైలురాయి సాధనలో కోవిన్ యాప్ పాత్రను డాక్టర్ ఆర్ఎస్ శర్మ ప్రశంసించారు.

దేశంలో 100 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ మైలురాయికి గుర్తుగా ఢిల్లీలోని కుతుబ్ మినార్ నుండి హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వరకు మొత్తం 100 వారసత్వ కట్టడాలు గురువారం జాతీయ జెండా రంగులతో ప్రకాశింపజేయబడ్డాయి.

ALSO READ China’s Covid Cases : చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం..విమానాలు రద్దు,స్కూల్స్ బంద్