ఈ ప్రభుత్వానికి హృదయం లేదు: చిదంబరం

ఈ ప్రభుత్వానికి హృదయం లేదు: చిదంబరం

సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచుతుంది. వేల సంఖ్యలో జనం.. డబ్బుల్లేకుండా ఆహారం కోసం క్యూలో నిలబడాల్సి వస్తుంది. 

ప్రభుత్వం డబ్బు పేదలకు ట్రాన్సఫర్ చేయాలని కోరుతున్నాను. అందుకే పూర్తిగా మనసు లేని ప్రభుత్వం అంటున్నా. వందల కొద్దీ జనాలు డబ్బుల్లేకుండా లైన్లలో నిలబడి వండిన ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మనసులేని ప్రభుత్వం ఏమీ చేయకుండా ఉంటుంది’ అని చిదంబరం ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను ట్యాగ్ చేశారు చిదంబరం. వీటితో పాటు ఎకనామిక్, మోరల్ ప్రశ్నలు కూడా వేశారు. వీటికి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పలేదన్నారు. అందులో మొదటి ప్రశ్న ప్రభుత్వం పేద కుటుంబాలకు నగదు బదిలీ చేయడంలో ఎందుకు విఫలమైంది. రెండోది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో దాచి ఉంచిన ధాన్యాన్ని పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదు. 

వారిని ఆకలి నుంచి కాపాడి, పేద కుటుంబాలకు నగదు బదిలీ చేసి హుందాతనాన్ని ఎందుకు నిలబెట్టడం లేదు. ప్రభుత్వం ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయదు. ఉచితంగా పంచడానికి ఏంటి సమస్య. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా దాచిన 77మిలియన్ టన్నుల ధాన్యాన్ని కొంచెం కూడా ఎందుకు వినియోగించడం లేదు. 

వేల మంది కార్మికులు దేశంలోని వేర్వేరు సరిహద్దుల ద్వారా ఇళ్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితులను సృష్టిస్తున్నారు. కరోనా వైరస్ ను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 15వేల మంది కంటే ఎక్కువగా కేసులు నమోదవగా 500మంది ప్రాణాలు కోల్పోయారు. 

మోడీ మే3 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన కొద్ది క్షణాల తర్వాత ట్వీట్ చేస్తూ ‘నా ప్రియ దేశమా ఏడువు’ అంటూ ట్వీట్ చేశారు. 

Also Read | వలస కూలీలు ఎక్కడ వారెక్కడే ఉండాలి- కేంద్రం