జార్ఖండ్ లో కొత్త అధ్యాయం…కేంద్రం దానికి రెడీ అయిందన్న హేమంత్

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 12:11 PM IST
జార్ఖండ్ లో కొత్త అధ్యాయం…కేంద్రం దానికి రెడీ అయిందన్న హేమంత్

తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఇవాళ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. కుల,వర్గ,మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేసి ప్రజల హృదయాలను గెల్చుకుంటామని సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోమని తెలిపారు.

సీఎం రఘుబర్ దాస్ పోటీ చేసిన జంషెడ్ పూర్ ఈస్ట్ స్థానంలో ఓడియారని,సరయు రాయ్ సీఎం ను ఓడించడాన్ని బట్టి చూస్తే సీఎంపై ప్రజలకు ఎంత కోపముందో అర్థమవుతుందన్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి కూర్చొని మంగళవారం ఉదయం కల్లా మంత్రి పదవుల పంపకం వంటి అన్ని విషయాలను క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటివరకు తాము ఎన్ఆర్సీ,సీఏఏని పూర్తిగా చూడలేదని,పూర్తిగా దాన్ని చూసేంతవరకు దానిపై ఏ నిర్ణయం తీసుకోబోమని సోరెన్ తెలిపారు.

అయితే దేశ ప్రజలను మరోసారి క్యూలో నిలబెట్టే కొత్త ఫార్ములాకు కేంద్రం రెడీ అయినట్లు కన్పిస్తోందని సోరెన్ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం రఘుబర్ దాస్ ఇవాళ గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నాడని సమాచారం. తాజా ట్రెండ్స్ ప్రకారం..జార్ఖండ్ లో 46స్థానాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో ఉండగా,బీజేపీ 25స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 81స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41ను ఇప్పటికే జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దాటేసింది.