‘హెర్బల్ మైసూర్ పాక్’ తింటే కరోనా తియ్యగా తగ్గిపోతుందట..!ఇమ్యూనిటీ పెరుగుతుందట..!!

  • Published By: nagamani ,Published On : July 8, 2020 / 04:10 PM IST
‘హెర్బల్ మైసూర్ పాక్’ తింటే కరోనా తియ్యగా తగ్గిపోతుందట..!ఇమ్యూనిటీ పెరుగుతుందట..!!

‘హెర్బల్ మైసూర్ పాక్’ తింటే కరోనా తియ్యగా తగ్గిపోతుందంటూ వ్యాపారి ప్రచారం..ఆ తరువాత ఏమైందంటే..
తియ్యటి తియ్యటి మైసూర్ పాక్..కాదు కాదు ‘హెర్బర్ మైసూర్ పాక్’ తింటే కరోనా వైరస్ సైతం తగ్గిపోతుంది. కరోనా మహమ్మారిని కూడా మా ‘హెర్బర్ మైసూర్ పాక్’ తగ్గించేస్తుదంటూ ఓ స్వీట్ షాపు వ్యాపారి తెగ ప్రచారం చేసేసాడు. మా షాపులో తయారు చేసిన ‘హెర్బర్ మైసూర్ పాక్’ తింటే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది కరోనా మీ చెంతకే రాదంటూ ప్రజల్ని తమిళనాడుకు చెందిన ఓ స్వీట్ షాపు యజమాని ఊదరగొట్టేశాడు. అంతేకాదు ఏకంగా ది తెలిసిన అధికారులు ఆ యజమానికి షాక్ ఇచ్చారు.

కోయంబత్తూర్‌లో చిన్నియం పాళయంలో ఉన్న ఈ స్వీటు షాపులో తయారు చేసిన ఈ హెర్బల్ మైసూర్ పాక్‌ తింటే కరోనా వైరస్ తగ్గిపోతుందంటూ ప్రచారం చేస్తున్న అతను మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించాడు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి ఈ మైసూర్ పాక్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించేశాడు.
తమ పూర్వీకులు తమకుఅందించిన మూలికా వైద్యంతో 19 రకాల ప్రత్యేక మూలికలతో తయారు చేసిన ఈ మైసూర్ పాక్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌ను అంతం చేస్తుందని..ఈ మైసూర్ పాక్ తిన్నవారికి కరోనా తగ్గిపోయిందని పూర్తిగా కోలుకున్నారంటూ ప్రచారం చేయటంతో స్థానికులు ఈజీగా నమ్మేశారు. ఇంకేముంది..ఆ షాపు దగ్గర క్యూ కట్టి మరీ కొనేస్తున్నారు. దీంతో ఆ షాపు యజమానికి కాసుల పంట పండింది.కిలోల కొద్దీ మైసూర్ పాక్ లు అమ్ముడైపోతున్నాయి.

తన హెర్బల్ మైసూర్ పాక్ బాగా పనిచేస్తోందని భావించిన షాపు యాజమాన్యం ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే ఆఫర్ ప్రకటించింది. తమ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్రానికి కూడా పంపిస్తామని చెప్పారు.

దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆ స్వీటు గుట్టు తెలుసుకోడానికి రంగంలోకి దిగారు. దర్యాప్తుచేపట్టారు. ఈ ప్రచారమంతా బూటకమని, ఆ వ్యాపారి మోసం చేస్తు తన స్వీటు షాపుకు కాసుల వర్షం కురిపిస్తున్నాడని తేల్చారు.

కాగా..కరోనా మందులు అంటూ కరోనా పేరు చెప్పి మోసం చేసేవారెందరో ఉన్నారు. ఇటువంటి బూటకపుమాటలు నమ్మవద్దనీ ఇటువంటివి మీ దృష్టికి వస్తే ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వమనిఅధికారులు సూచించారు.