Hero Electric Bike: హీరో ఎలెక్ట్రిక్ బైక్ పై రూ.28,000 వరకు తగ్గింపు

ఇక ఫేమ్ - 2 పాలసీపై హీరో ఎలెక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ఇవ్వడం ద్వారా వీటి అమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. చాలా రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చార్జీలు తీసివేయడంతో నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఎలెక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 5 నుంచి 7 మిలియన్ యూనిట్ల వాహనాలు రోడ్లపైకి వస్తాయని సోహిందర్ గిల్ తెలిపారు.

Hero Electric Bike: హీరో ఎలెక్ట్రిక్ బైక్ పై రూ.28,000 వరకు తగ్గింపు

Hero Electric Bike

Hero Electric Bike: ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలెక్ట్రిక్ వాహన తయారి సంస్థలు ఉత్పత్తిని పెంచి డిమాండ్ కు తగినట్లు అందుబాటులోకి తెచ్చే విధంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇక ఇదే సమయంలో వినియోగ దారులపై భారం తగ్గించేందుకు భారీగా రాయితీలను ప్రకటిస్తుంది. పెట్రోల్, డీజిల్ వాడటం ద్వారా రోజు రోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుండటంతో ఎలెక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఎలెక్ట్రిక్ వాహనాల తయారి కంపెనీలు రాయితీలు పెంచాలని సూచించింది. దీంతో ఎలెక్ట్రికల్ వాహనాల ధరలు భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫేమ్‌–2 స్కీమ్‌ను 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో హీరో ఎలక్ట్రిక్‌ మోడల్‌ను బట్టి 12 నుంచి 33 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఇక తగ్గిన ఎలెక్ట్రిక్ బైకుల వివరాలను పరిశీలిద్దాం

ఫోటాన్ హెచ్‌ఎక్స్‌ ప్రత్యేకమైన మోడల్ ఇప్పుడు రూ. 71,449 కి లభిస్తుంది. రాయితీకి ముందు దీని ధర రూ.79,940 గా ఉండేది. ఈ వెహికల్ ధరను రూ .8,491 తగ్గించారు. ఆప్టిమా ఇఆర్ డబుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 58,980గా ఉంది. గతంలో దీని ధర రూ. 78,640గా ఉండేది. ఈ మోడల్ పై ఏకంగా రూ .19,660 లభిస్తుంది. హీరో నైక్స్ హెచ్ఎక్స్ ట్రిపుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ టూ వీలర్ ధర రూ. 1,13,115 గా ఉండగా ప్రస్తుతం రూ .85,136 ధరకు లభిస్తుంది. ఈ టూ వీలర్ పై అత్యధికంగా 27,979 రూపాయల రాయితీ ఇస్తున్నారు.

ఇక ఫేమ్ – 2 పాలసీపై హీరో ఎలెక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ఇవ్వడం ద్వారా వీటి అమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. చాలా రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చార్జీలు తీసివేయడంతో నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఎలెక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 5 నుంచి 7 మిలియన్ యూనిట్ల వాహనాలు రోడ్లపైకి వస్తాయని సోహిందర్ గిల్ తెలిపారు.