తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అనుమానంగా ఉంది. వీటిని బట్టి చూస్తూ కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదనే భావనను హైకోర్టు వ్యక్తం చేసింది.



కరోనాకు ముందు, తర్వాత వైద్యరంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా స్పష్టంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
https://10tv.in/corona-in-telangana-recovered-as-a-one-lakh-people/
ఆగష్టు 31నుంచి సెప్టెంబర్ 4వరకూ జిల్లా వారీగా బులెటిన్లు సమర్పించాలని చెప్పింది. జీహెచ్ఎంసీలోని ఐసోలేషన్, కోవిడ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని చెప్పింది.