చైనాతో యుద్ధానికి పంపాలని కోరుతూ రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన హోమ్ గార్డ్

  • Published By: nagamani ,Published On : June 23, 2020 / 05:31 AM IST
చైనాతో యుద్ధానికి పంపాలని కోరుతూ రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన హోమ్ గార్డ్

భారత సైనికులను అత్యంత క్రూరంగా చంపిన చైనాపై భారతీయులు రగిలిపోతున్నారు. డ్రాగన్ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళూరిపోతున్నారు. అలీఘడ్ లో కొంతమంది చిన్నారులు చైనాపై యుద్దానికి వెళ్తున్నాం అని పోలీసులతో చెప్పారు అంటే..చైనాపై ఎంతగా ప్రతీకారం కోసం రగిలిపోతున్నారు అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో తనను చైనాపై యుద్ధానికి పంపించాలని ఓ హోంగార్డ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తన రక్తంతో లేఖ రాశాడు. ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండగా..ఏ క్షణానైనా యుద్ధం జరుగుతాయని వాతావరణం నెలకొంది. ఇరు పక్షాలూ అదనపు సైన్యాలను తరలిస్తున్న వేళ, తనకు యుద్ధంలో పాల్గొనేందుకు దయచేసి అవకాశం ఇవ్వాలని కోరుతూ..కర్ణాటకలోని రాయచూరు జిల్లా మస్కి ప్రాంతానికి చెందిన హోంగార్డ్ గా పనిచేస్తున్న మడివాళ లక్ష్మణ్ హోమ్ గార్డు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో ఓ లేఖ రాశాడు.

మడివాళ లక్ష్మణ్.. హోమ్ గార్డుగా పనిచేస్తూనే పలు సామాజిక సేవలు చేస్తుంటాడు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రీగానే ఇస్తుంటాడు. గ్రామంలోని పిల్లలకు దేశభక్తిని గురించి ఎన్నో కథలు చెబుతుంటాడు. దేశం కోసం మన భారత సైనికులు ఎంతగా కష్టపడుతున్నారో..వారు కుటుంబాలను వదులుకుని..ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి..శతృమూకలపై ఎలా పోరాడుతుంటారో చెబుతుంటాడు. 

అంతేకాదు..పిల్లల్లో క్రీడా మనోభావాలను పెంచుతున్నాడు. మ్యాథ్స్, సైన్స్ టీచర్ గానూ పనిచేస్తున్నాడు. ఒకవేళ ఇండియా, చైనాల మధ్య యుద్ధం వస్తే, దేశ రక్షణకు తాను ముందుండాలని ఎంతగానో తపన పడుతున్నాననీ..నన్ను యుద్దానికి పంపిస్తే..నా సైనిక సోదరుల ప్రాణాలు తీసిన చైనాపై జరిగే యుద్ధంలో నా ప్రాణాల్ని పణ్ణంగా పెడతానని దయచేసి నాకు ఈ అవశం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. తనేదో ఆవేశంతో ఈ లేఖను నా రక్తంతో రాయలేదనీ..డాక్టర్ల్ సలహాలు తీసుకుని..నా రక్తంతోనే దీన్ని రాశానని చెప్పాడు. నా దేశం కోసం నా ప్రాణాల్ని ఇచ్చే అవకాశం వస్తే ఏమాత్రం వెనుకాడనని..నా సోదరుల ప్రాణత్యాగాలకు సరైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని దేశభక్తి నిండిన భావోద్వేగంతో చెప్పాడు లక్ష్మణ్. 

Read: కొత్తగా 14 వేల 933 కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవే!