బురదలో మహిళను లాక్కెళ్లిన సెక్యూర్టీ గార్డు..ప్రభుత్వాసుపత్రిలో దారుణం

బురదలో మహిళను లాక్కెళ్లిన సెక్యూర్టీ గార్డు..ప్రభుత్వాసుపత్రిలో దారుణం

hospital security guard : మానవత్వం చచ్చిపోతోంది. జనాలను మూర్ఖులుగా తయారవుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. సాటి మనుషుల పట్ల జాలి అనేది లేకుండా పోతోంది. ఆసుపత్రికి వచ్చిన మహిళకు సహాయం చేయాల్సిన సెక్యూర్టీ గార్డు..దారుణంగా ప్రవర్తించాడు. ఆసుపత్రి దగ్గరి నుంచి గేటు వరకు మహిళ చేయి పట్టుకుని..లాక్కెళ్లి పడేశాడు. మధ్యలో బురదలో ఉన్నా..ఆమె దుస్తులు తొలగిపోయిన..అలాగే..లాక్కెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

భోపాల్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గోన్ ప్రభుత్వాసుపత్రికి ఓ మహిళ వచ్చింది. ఎవరో వచ్చి ఇక్కడ వదిలేసివెళ్లారు. ఆమె మానసికస్థితి బాగా లేదని సమాచారం. తనకు చికిత్స చేయాలంటూ..వేడుకుంది. ఆమెకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేకపోవడంతో..చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు.

ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వెళ్లిపోకుండా..అక్కడనే ఉంటూ..వచ్చిపోయే వారిని అడ్డుకొంది. దీంతో సెక్యూర్టీ గార్డు చేరుకుని..మహిళను చేయి పట్టుకుని నేలపై నుంచి లాక్కెళ్లాడు. మధ్యలో బురదలో ఉన్నా..అలాగే లాక్కెళ్లి..గేటు బయట పడేశాడు. అక్కడనే ఉన్న కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సెక్యూర్టీ గార్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు..ఆ సెక్యూర్టీ గార్డును సస్పెండ్ చేశారు.