Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. తీవ్రవాద కోణం ఉందా అని పోలీసుల అనుమానం?
అమృత్‌పాల్ సింగ్ స్థావరం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి అతడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో కూడా ఎస్ఐ పాత్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Amritpal Singh: పంజాబ్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అనేక చోట్ల అతడి కోసం, అతడి అనుచరుల కోసం సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అమృత్‌పాల్ సింగ్ స్థావరం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీన్ని బట్టి అతడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో కూడా ఎస్ఐ పాత్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ ‘ఆనంద్ పూర్ ఖల్సా ఫౌజ్’ పేరుతో ఒక తీవ్రవాద సంస్థను స్థాపించేందుకు కూడా యత్నించినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ విషయాల్ని పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ మీడియాకు వెల్లడించారు. ఇటీవల జరిగిన అల్లర్లకు సంబంధించి ఆరు ఎఫ్ఆర్‌లు నమోదయ్యాయని, మొత్తం 114 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Video Games: అదేపనిగా మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?
గిల్ చెప్పిన వివరాల ప్రకారం.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసే వరకు కూడా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించబోతుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయనున్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్లో ముఖ్య వ్యక్తుల్ని పోలీసులు అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు అమృత్‌పాల్ సింగ్ వ్యవహారం లండన్ వరకు పాకింది. అక్కడి భారత రాయబార కార్యాలయంలోని భారతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనిపై సిక్కులు ఢిల్లీలోని బ్రిటీష్ రాయబార కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ అంశంపై సమాధానం చెప్పాలని బ్రిటీష్ రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది.