Arvind Kejriwal: ‘నేను ప్ర‌పంచంలోనే అత్యంత తియ్యని ఉగ్ర‌వాదిని’

నేను ప్ర‌పంచంలోనే అత్యంత తియ్యని ఉగ్ర‌వాదిని అని ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ అన్నారు.

Arvind Kejriwal: ‘నేను ప్ర‌పంచంలోనే అత్యంత తియ్యని ఉగ్ర‌వాదిని’

Sweetest Terrorist In The World Cm Kejriwal

Arvind Kejriwal: ‘ప్ర‌పంచంలోనే అత్యంత తియ్యని ఉగ్ర‌వాదిని నేనే’ అంటూ ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ స్వీట్ గా చెప్పారు. శుక్రవారం (ఫిబ్రవరి 18,2022) బటిండాలో మీడియాతో మాట్లాడుతూ..పార్టీ మాజీ స‌హ‌చ‌రుడు క‌వి కుమార్ విశ్వాస్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం హాస్పిట‌ళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే నేను స్వీటెస్ట్ టెర్ర‌రిస్టుని అని క్రేజ్రీగా అన్నారు కేజ్రీ. పార్టీ మాజీ సహచరుడు కుమార్ విశ్వాస్ చేసిన వేర్పాటువాదులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలను తోసిపుచ్చారు కేజ్రీవాల్. వృద్ధుల‌ను ఆశ్ర‌మాల‌కు, ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఉగ్ర‌వాది నేను అంటూ చమత్కరించారు.

వాళ్ల ఆరోప‌ణ‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని.. వాటిని న‌మ్మితే నిజంగానే నేను ఉగ్ర‌వాదిని అవుతాన‌ని..అటువంటప్పుడు గత 10 ఏళ్ల నుంచి భ‌ద్ర‌తా ఏజెన్సీలు ఏం చేస్తున్న‌ాయి? అని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. వందేళ్ల క్రితం కూడా భ‌గ‌త్ సింగ్‌ను బ్రిటీష‌ర్లు ఉగ్ర‌వాదిగా పిలిచార‌ని, భ‌గ‌త్‌ను తాను గుడ్డిగా ఫాలో అవుతాన‌ని, ఇప్పుడు మ‌ళ్లీ చ‌రిత్ర తిరుగ‌రాస్తున్నార‌ని అన్నారు. అవినీతి నేత‌లంతా ఒక్క‌టై భ‌గ‌త్ సింగ్ భ‌క్తుడిని ఉగ్ర‌వాదిగా పిలుస్తున్న‌ారని కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్.త‌న‌పై ఎన్ఐఏలో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఓ ఆఫీస‌ర్ తెలిపార‌ని, రెండు రోజుల్లో ఆ కేసు ఫైల్ చేయ‌నున్నారని తనకు సమాచారం అందింది అన్నారు. అలాంటి ఎఫ్ఐఆర్‌ల‌ను నేను స్వాగ‌తిస్తానని సీఎం కేజ్రీ చెప్పారు.

Also read: Arvind Kejriwal: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు

కాగా..పంజాబ్ లోని జలంధర్ లో రోడ్ షో నిర్వహించిన సీఎం కేజ్రీవాల్..పంజాబ్ లో అభివృద్ధి కాదు ఇప్పటి వరకు 150 గ్రామాలకు నీటి సరఫరా కూడా లేదని విమర్శించారు. గత 5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలియదని అన్నారు.గత 70 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. ఆప్ ను గెలిపిస్తే..ప్రతి గ్రామానికి నీటి సరఫరా అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆపార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, అలాకాకపోతే..పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని” కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రతినిధికి బుధవారం (ఫిబ్రవరి16,2022) ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరో నాలుగు రోజుల్లో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఈక్రమంలో కుమార్ విశ్వాస్(AAP Ex-leader) చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కుమార్ విశ్వాస్ మాట్లాడిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాళవియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వేళ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వస్తే ఇది ఎంతో ప్రమాదకరమని అమిత్ మాళవియా ఆరోపించారు. దేశంపై కుట్రలు పన్నే ఇటువంటి నేతలకు ఓట్లు వేయరాదని ప్రజలకు సూచించారు.

Also read: Modi-Channi : గురుగోవింద్‌ ఎక్కడ పుట్టారో తెలుసా..? చన్నీ “భాయియే” మాటకు మోడీ మార్క్ పంచ్

ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఢిల్లీలో ప్రజాధారణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే కొన్ని రోజుల్లోనే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో విసుగుచెందిన కుమార్.. పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం కవిగా కొనసాగుతున్న కుమార్ విశ్వాస్ ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి కౌంటర్ గా ప్రజల కోసం హాస్పిట‌ళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే నేను స్వీటెస్ట్ టెర్ర‌రిస్టుని అని క్రేజ్రీగా అన్నారు కేజ్రీవాల్.