మహారాష్ట్రలో లాక్ డౌన్ ని తోసిపుచ్చలేం..సీఎం ఉద్దవ్ ఠాక్రే

మహారాష్ట్రలో కరోనా వైరస్​ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్​డౌన్​ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

మహారాష్ట్రలో లాక్ డౌన్ ని తోసిపుచ్చలేం..సీఎం ఉద్దవ్ ఠాక్రే

I Cannot Rule Out Imposing A Lockdown Maharashtra Cm Uddhav Thackeray

Uddhav Thackeray మహారాష్ట్రలో కరోనా వైరస్​ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్​డౌన్​ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం ఉద్దవ్ ఠాక్రే..రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రోజుకు 2.5 లక్షల ఆర్​టీ పీసీఆర్​ టెస్టులు చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్న సీఎం.. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి టీకా తీసుకున్నాక కూడా వైరస్​ సోకుతుందని అన్నారు.

కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే, రాబోయే 15-20 రోజుల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల(హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కొరత ఉండవచ్చని ఉద్దవ్ తెలిపారు. కరోనా వైరస్ ని అరికట్టడానికి రానున్న కొన్ని రోజుల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేయబడతాయన్నారు.