India Corona : ఇండియాకు కాస్త రిలీఫ్.. వరుసగా రెండోరోజు తగ్గిన కరోనా కేసులు, మరణాలు

కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.

India Corona : ఇండియాకు కాస్త రిలీఫ్.. వరుసగా రెండోరోజు తగ్గిన కరోనా కేసులు, మరణాలు

India Corona

India Corona : కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. దేశంలో కరోనా కల్లోలం కొంచెం కొంచెం తగ్గుతోంది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
నిన్నటితో పోలిస్తే ఇవాళ దాదాపు 20వేల కేసులు తగ్గాయి. మరణాలు కూడా 200 తగ్గడం కొంచెం ఊరట కలిగిస్తోంది.

దేశంలో నిన్న ఒక్కరోజే 16,93,093 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3లక్షల 26వేల 098 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరసగా రెండోరోజు కూడా కొత్త కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 3వేల 890 మంది కరోనాకు బలయ్యారు. మొత్తంగా 2.43కోట్ల మందికి వైరస్ సోకగా..2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్రితం రోజుతో పోల్చుకుంటే యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం 36,73,802 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న(మే 14,2021) ఒక్కరోజే 3,53,299 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల రేటు 15.41 శాతానికి చేరగా..రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. నిన్న 11,03,625 మంది టీకా వేయించుకున్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 18,04,57,579 మందికి టీకా అందింది.

మహారాష్ట్ర, ఢిల్లీలో అదుపులో కరోనా:
మహారాష్ట్రలో కొవిడ్ ఆంక్షలు పని చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 తర్వాత మొదటిసారి కొత్త కేసుల సంఖ్య 40వేల దిగువకు చేరింది. తాజాగా 39వేల 923 మందికి కరోనా సోకగా..695 మంది ప్రాణాలు వదిలారని ఆ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న మరణాలను కూడా ఈ సంఖ్యలో చేర్చినట్లు తెలిపింది. ఢిల్లీలో కూడా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న 8,506 మందికి కరోనా సోకగా..289 మంది మరణించారు.