India : 24 గంటల్లో..లక్షకు పైగా కరోనా కేసులు, 630 మంది మృతి

ప్రపంచంలోని కరోనా టాప్‌ దేశాలను బీట్‌ చేస్తూ భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

India : 24 గంటల్లో..లక్షకు పైగా కరోనా కేసులు, 630 మంది మృతి

coronavirus cases in India

corona cases : ప్రపంచంలోని కరోనా టాప్‌ దేశాలను బీట్‌ చేస్తూ భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే లక్ష 15వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇటు మరణాల్లోనూ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 24గంటల్లోనే 630 మందికి పైగా కరోనాతో చనిపోయారు. గతేడాది నవంబర్‌ 5 తర్వాత ఒక్కరోజులో ఇన్ని మరణాలు రికార్డుకావడం ఇదే మొదటిసారి.

భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8 లక్షలు దాటేసింది. రెండు రోజుల క్రితం 7 లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు.. 48 గంటల్లోనే 8 లక్షల మార్క్‌ను రీచ్‌ అయింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు రికార్డయ్యాయి. 24 రోజుల ముందు 2లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు ఇప్పుడు ఏకంగా 8లక్షలు దాటింది. కరోనా సెకండ్‌వేవ్‌ ఉగ్రరూపానికి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌ అల్లడిపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే అక్కడ ఏకంగా 9 వేల 900లుకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది రాష్ట్రంలో కరోనా మొదలయ్యాక ఇంత భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి.

Read More : Madvi Hidma : హిడ్మాకి దొరికితే.. కిరాతకంగా చంపేస్తాడు.. అతడి యుద్ధ విద్యలు ఇక్కడివి కావు!