Corona Update: కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు.. భారత్‌లో తగ్గుముఖం!

దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Update: కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు.. భారత్‌లో తగ్గుముఖం!

India Covid

Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి. మునుపటిరోజు కంటే కేసులు కొంచెం తగ్గగా.. ఇదే సమయంలో 356మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 15వేల 951మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి.

Rangamarthanda: కృష్ణవంశీ కోసం మెగాస్టార్ గాత్ర దానం!

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మూడు కోట్ల 42 లక్షల 2 వేల మంది కరోనాకు గురయ్యారు. వీరిలో నాలుగు లక్షల 55 వేల 68 మంది చనిపోగా.. ఇప్పటివరకు 3 కోట్ల 35 లక్షల 83 వేల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల కన్నా తక్కువగా ఉంది. మొత్తం లక్షా 67 వేల 695మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసులు – మూడు కోట్ల 42 లక్షల 2 వేల 202
కోలుకున్నవారు – మూడు కోట్ల 35 లక్షల 83 వేల 318
మొత్తం యాక్టివ్ కేసులు – ఒక లక్ష 63 వేల 816
చనిపోయినవారు- నాలుగు లక్షల 55 వేల 68
వ్యాక్సినేషన్ – 102 కోట్ల 94 లక్షల 1 వేల డోసులు

Rajinikanth: రజనీ ఓ సూపర్ పవర్.. అవార్డులకే రివార్డ్ ఈ తలైవా

కేరళలో 6,664 కొత్త కరోనా కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా కేరళలో మాత్రం కొత్తగా 6వేల 664 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య49 లక్షల 12 వేల 789కి పెరిగింది. గత 24 గంటల్లో, 9,010 మంది కోలుకున్నారు.

Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

వ్యాక్సినేషన్:
అక్టోబర్ 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 102 కోట్ల 94 లక్షల 1వెయ్యి డోసుల కరోనా వ్యాక్సిన్‌లు కరోనా వ్యాక్సిన్‌లు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.