ఇండియాలో డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కరోనా బాధితులు.. 24గంటల్లో 22వేల 854 కొత్త కేసులు

India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,2021) రికార్డ్ స్థాయిలో 22వేల 854 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 126 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు సంఖ్య 1,12,85,561కి చేరగా.. 1,58,189 మంది ప్రాణాలు వదిలారు. ఈ మేరకు గురువారం(మార్చి 11,2021) కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో 7లక్షల 78వేల 416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో యాక్టివ్ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం లక్ష 89వేల 226 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 1.68 శాతానికి చేరింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. తాజాగా 18వేల 100 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం:
మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. నిత్యం సుమారు 10వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న మాత్రం అత్యధికంగా 13వేల 659 కొత్త కేసులు బయటపడ్డాయి. 54 మంది కరోనాకు బలయ్యారు. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. లేకపోతే మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

మొత్తం కరోనా కేసులు: 1,12,85,561
మొత్తం రికవరీలు: 1,09,38,146
యాక్టివ్ కసులు: 1,89,226
మొత్తం కరోనా మరణాలు: 1,58,189

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1649కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం(మార్చి 11,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనా బారి నుంచి నిన్న 116 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,032కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,855 ఉండగా.. వీరిలో 730 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90,93,645కి చేరింది.