Covid-19 : భారత్ లో కరోనా అల్లకల్లోలం, 24 గంటల్లో 2 వేల 767 మంది మృతి

వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Covid-19 : భారత్ లో కరోనా అల్లకల్లోలం, 24 గంటల్లో 2 వేల 767 మంది మృతి

india health minister

India : భారత దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3 లక్షల 49 వేల 391 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 2 వేల 767 మంది చనిపోయారు.

మొత్తంగా కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య లక్షా 92 వేల 311కి చేరుకుంది. కొత్తగా 2 లక్షల 17 వేల 113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో కోటి 40 లక్షల 85 వేల 110 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 83.49కి పడిపోయింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. మరోవైపు..27.79 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో 17 వేల 19 వేల 588 టెస్టులను నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోట్ల 79 వేల 18 వేల 810 టెస్టులు నిర్వహించారు. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 54 శాతం కేసులు నమోదయ్యాయి. మే 01వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

కర్నాటక రాష్ట్రంలో 30 వేల కేసులు, బెంగళూరులో కేవలం ఒక్క రోజులో 17 వేల కొత్త కేసులు వెలుగు చూశాయి.
వెస్టె బెంగాల్ లో 14 వేల 281 కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు.
మహారాష్ట్రలో 67 వేల కొత్త కేసులుగా నిర్ధారించారు. ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం విశేషం.

Read More : AIIMS Chief : 10 శాతం పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందే – ఎయిమ్స్