Indian military: రష్యా, యూకేల కంటే ముందంజలో భారత్.. 23వ స్థానంలో పాకిస్థాన్ ..

సరిహద్దుల్లో దేశానికి రక్షణగా నిలిచే మిలిటరీ కోసం భారత్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. గతంలో, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మిలిటరీకి నిధుల కేటాయింపులో అధికంగా ఉంటూ వస్తున్నాయి....

Indian military: రష్యా, యూకేల కంటే ముందంజలో భారత్.. 23వ స్థానంలో పాకిస్థాన్ ..

Indiana Armey

Indian military: సరిహద్దుల్లో దేశానికి రక్షణగా నిలిచే మిలిటరీ కోసం భారత్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. గతంలో, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మిలిటరీకి నిధుల కేటాయింపులో అధికంగా ఉంటూ వస్తున్నాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో రక్షణ రంగం వ్యవస్థకు కేటాయింపులపై గ్లోబల్ థింక్-ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ (SIPRI) డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్‌(UK)ల కంటే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మిలిటరీ ఖర్చుదారుగా భారత్ ముందంజలో నిలిచింది. అయితే చైనా కంటే నాలుగు రెట్లు దాని రక్షణ బడ్జెట్‌కు 10రెట్లు ఖర్చు చేస్తున్న యునైటెడ్ స్టేట్స్ (US) కంటే చాలా వెనుకబడి ఉంది. కోవిడ్ -19 మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో $2,113 బిలియన్లకు పెరిగింది. ఇది మొదటిసారిగా రెండు ట్రిలియన్- యూఎస్‌డి మార్కును అధిగమించింది.

Indian Military in 2021: 2021లో భారత మిలిటరీలో జరిగిన 11 ప్రమాదాలు

దేశ రక్షణకోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ఐదు దేశాల్లో భారత్ మూడవ స్థానంలో నిలిచింది. వీటిలో US ($801 బిలియన్)గా మొదటి స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచ సైనిక వ్యయంలో 38%గా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన చైనా ఆ దేశ రక్షణ వ్యవస్థ కోసం సుమారు $293 బిలియన్లు ఖర్చు చేస్తుంది. ఇక భారత్ $77 బిలియన్లు ఖర్చు చేస్తుంది. యునైటెడ్ కింగ్ డమ్ UK ($68 బిలియన్లు), రష్యా ($66 బిలియన్లు) ఆ దేశ రక్షణ వ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే భారత్ కు ప్రత్యర్థి దేశంగా ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీకోసం 11 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తూ ప్రపంచంలో 23వ స్థానంలో నిలిచింది

Indian Military : డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు

భారతదేశం యొక్క వ్యయం 2020 నుండి 0.9% కాగా 2012 నుండి 33% పెరిగింది. సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాల మధ్య అప్పుడప్పుడు సాయుధ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారత్ తన సాయుధ దళాల ఆధునీకరణకు, ఆయుధాల ఉత్పత్తికి ప్రాధాన్యతను పెంచినట్లు SIPRI సర్వే పేర్కొంది. 15లక్షల మంది బలమైన సాయుధ బలగాలకు రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పెన్షన్ బిల్లు కోసం పెరుగుతున్న ఆదాయ వ్యయాలతో దేశం యొక్క సైనిక ఆధునీకరణకు కొంతమేర ఆటంకం ఏర్పడుతుంది. ఉదాహరణకు 2022-2023 కోసం భారతదేశం రూ. 5.2 లక్షల కోట్ల రక్షణ బడ్జెట్‌లో 33 లక్షలకు పైగా రిటైర్డ్ సైనిక, రక్షణ పౌరులకు రూ. 1.2 లక్షల కోట్ల పెన్షన్ బిల్లు ఉంది. అంతేకాకుండా రూ. 2.3 లక్షల కోట్ల ఆదాయ వ్యయం మొత్తం ఆధునికీకరణ, కొత్త ఆయుధ వ్యవస్థల కోసం రూ. 1.5 లక్షల కోట్ల మూలధన కేటాయింపులను చేసింది.

Indian Army : ఈ ఏడాది 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

ఈ క్రమంలో సాయుధ దళాల ఫైటర్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌ల నుండి డ్రోన్‌లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, రాత్రి వేళల్లో పోరాట సామర్థ్యాల పెంపు వరకు అనేక రంగాల్లో భారత్ ఆర్మీ కొంత క్లిష్టమైన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తూర్పు లడఖ్‌లో చైనాతో రెండేళ్లపాటు సాగిన సైనిక ఘర్షణ, గతంలో ఇతర సరిహద్దు సంక్షోభాల మాదిరిగానే, విదేశాల నుంచి ఆర్మీ, నేవీ, IAF అత్యవసర కొనుగోళ్లను చేప్పటింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా భారతదేశాన్ని వ్యూహాత్మకంగా బలహీనపరిచే స్థితి నుండి బయటపడటానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇది ప్రపంచ ఆయుధాల దిగుమతుల్లో 11% వాటాను కలిగి ఉంది.