Swiss Bank: ‘స్విస్ బ్యాంకులో ఇండియన్ల 20వేల కోట్లు ఉన్నాయనేది నిజం కాదు’

స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల నిధులు రూ.20వేల 700కోట్లకు మించి ఉన్నాయనే వార్తను కొట్టిపారేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 13ఏళ్లుగా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమయ్యాయంటూ వార్తలు వచ్చాయి.

Swiss Bank: ‘స్విస్ బ్యాంకులో ఇండియన్ల 20వేల కోట్లు ఉన్నాయనేది నిజం కాదు’

Swiss Bank

Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల నిధులు రూ.20వేల 700కోట్లకు మించి ఉన్నాయనే వార్తను కొట్టిపారేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 13ఏళ్లుగా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమయ్యాయంటూ వార్తలు వచ్చాయి.

‘2021 జూన్ 18న నమోదైన లెక్కల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో రూ.20వేల 700 కోట్ల కంటే ఎక్కువగా నిధులు జమ అయ్యాయని వార్తలు వచ్చాయి. 2019 చివరి నాటికి రూ.6వేల 625కోట్లుగా ఉన్న నిధులు రెండేళ్లలో తగ్గాల్సింది పోయి పెరిగాయని వార్తలు వినిపించాయి. పైగా 13ఏళ్లలో ఇదే అత్యధికం అని కూడా వచ్చింది’ అని మంత్రిత్వశాఖ పేర్కొంది.

స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) అధికారిక లెక్కల ప్రకారం.. స్విట్జర్లాండ్ లో ఇండియన్ల బ్లాక్ మనీ డిపాజిట్ అయిందనేది నిజం కాదు. ఇంకా చెప్పాలంటే డిపాజిట్ చేసిన అమౌంట్ ఇండియన్లది, ఎన్నారైలది కాదు. అవి ఇతర దేశాలకు చెందిన వాళ్లవి.

2019 నుంచి నిజానికి కస్టమర్ల డిపాజిట్లు తగ్గిపోయాయి. కాకపోతే వారంతా.. బాండ్స్ రూపంలో, సెక్యూరిటీస్, ఇతర ఫైనాన్షియల్ ఇన్ స్ట్రూమెంట్స్ పద్ధతిలో జమ చేస్తూ వస్తున్నారు.

ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. స్విస్ బ్యాంకులో ఉన్న డిపాజిట్ అమౌంట్ పెరిగినట్లు సమాచారం లేదు. పెరిగింది కూడా ఇండియన్లు అని డిక్లేర్ చేయని వాళ్ల నుంచే పెరిగాయని లీగల్ అగ్రిమెంట్ ఉపయోగించి తెలుసుకున్నారు. స్విస్ అథారిటీలను సంప్రదించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్విస్ బ్యాంకుల్లో నిధులు పెరగడానికి లేదా తగ్గడానికి అనుకూలించిన అంశాలపై ఆరా తీసింది.