Karnataka Farmer: రైతుని అవమానించిన కార్ షో రూమ్ సేల్స్ మ్యాన్, ఆతరువాత అద్దిరిపోయే సీన్

రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. "రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు" అని నిరూపించాడు.

Karnataka Farmer: రైతుని అవమానించిన కార్ షో రూమ్ సేల్స్ మ్యాన్, ఆతరువాత అద్దిరిపోయే సీన్

Farmer

Karnataka Farmer: దేశానికి అన్నం పెట్టె రైతన్న నిస్వార్ధంతో పనిచేస్తాడు. ఎటువంటి కల్మషంలేకుండా అందరిని సమానంగా చూసే రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. “రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు” అని నిరూపించాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన కెంపె గౌడ అనే రైతు తన వ్యవసాయ అవసరాల నిమిత్తం ఒక పికప్ ట్రక్ వాహనాన్ని కొనేందుకు జిల్లా కేంద్రంలోని మహీంద్రా కార్ షోరూంకి వెళ్ళాడు. కెంపెగౌడ మరో పది మందితో కలిసి వాహనాన్ని చూసేందుకు షోరూంకి చేరుకున్నాడు.

Also read: Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

తమకు కారు కావాలంటూ అక్కడున్న సేల్స్ మ్యాన్ ని అడగ్గా.. సేల్స్ మ్యాన్ వీరిని అవమానించాడు. “మీ అవతారం చూసుకున్నారా? మీరు రూ.10 కారే కొనలేరు రూ.10 లక్షల విలువైన కారును కొంటారా?” అంటూ అవహేళనగా మాట్లాడాడు. అంతే కాకుండా రైతు కెంపెగౌడ దుస్తులను చూసి..అవమానించిన సేల్స్ మ్యాన్.. “కారు కొనేందుకు ఊరు ఊరంతా వస్తారా?” అంటూ మరింత ఘోరంగా అవమానించాడు. రైతులకు, కార్ షోరూం సిబ్బందికి మధ్య దాదాపు అరగంటకు పైగా జరిగిన ఉత్కంఠ పరిణామాలు ఇరువురి మధ్య సై అంటే సై అనే స్థాయికి చేరుకున్నాయి. కారు షో రూమ్ సిబ్బంది సైతం సేల్స్ మ్యాన్ కె వత్తాసు పలికారు. షో రూమ్ యాజమాన్య ప్రవర్తనతో బాధపడ్డ రైతు కెంపెగౌడ..వారికి గుణపాఠం చెప్పాలని భావించాడు.

Also read: Sanitary Napkins: అబ్బాయిలకు శానిటరీ న్యాప్‌కిన్స్? బీహార్ స్కూల్లో వెలుగులోకి ఘటన

ఎలాగైనా అప్పటికప్పుడే కారు కొని తీరాలని నిశ్చయించుకున్న రైతు కెంపెగౌడ..తన మిత్రులకూ తెలిసిన బంధువులకూ ఫోన్ చేసి అరగంటలో రూ.10 లక్షలు పోగేసాడు. అనంతరం సేల్స్ మ్యాన్ వద్దకు వెళ్లి ఆ డబ్బును అప్పజెప్పి.. అప్పటికప్పుడు కారు ఇవ్వాలని రైతు డిమాండ్ చేయడంతో.. షో రూమ్ లో ఉన్నవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. రైతు కెంపెగౌడ అడిగిన కారును డెలివరీ చేసిన షో రూమ్ యజమాన్యం.. జరిగిన ఘటనపై రైతుకి క్షమాపణలు చెప్పారు. అయితే తనకు జరిగిన అవమానం మరేఇతర రైతుకు జరగకూడదంటూ కార్ షోరూం యజమాన్యంపై రైతు కెంపెగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడంతో.. షోరూం యాజమాన్యం తమ తప్పు తెలుసుకుని క్షమించాలంటూ లిఖితపూర్వకంగా రైతుని కోరింది. ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. కార్ షోరూమ్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Malaika Arora : నేనేం బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు