SSLV-D2: నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ -డీ2.. ప్రయోగానికి సర్వం సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

SSLV-D2: నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ -డీ2.. ప్రయోగానికి సర్వం సిద్ధం

SSLV-D2

SSLV-D2: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగం సందర్భంగా ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ షార్‌లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రిహార్సల్స్ నిర్వహించి, రాకెట్ పనితీరు సరిగ్గాఉన్నట్లు నిర్ధారించారు. శుక్రవారం తెల్లవారు జామున 2.48 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 6.30 గంటలపాటు కొనసాగిన తరువాత ఉదయం 9.18గంటకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ISRO Chandrayan-3 : జూలై నాటికి చంద్రునిపైకి చంద్రయాన్-3.. సురక్షిత ల్యాండింగ్‌పై దృష్టిపెట్టామన్న ఇస్రో చైర్మన్

ఈ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది. ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 450 కిలో మీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07 అదేవిధంగా, 880 సెకన్ల వ్యవధిలో జానుస్-1ను, 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

ISRO Launches 36 Satellites: ఇస్రో ఖాతాలో మరో విజయం.. 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం2 రాకెట్

ఇస్రో వివరాల ప్రకారం.. ఎస్ఎస్ఎల్‌వీ లాంచ్ ఆన్ డిమాండ్ ప్రాతిపదికన తక్కువ భూమి కక్ష్యలకు 500 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎస్ఎల్‌వీ అనేది 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసం కలిగిన వాహనం.అయితే, ఎస్ఎస్ఎల్‌వీ మొదటి ప్రయోగం గత ఏడాది ఆగస్టు 9న పాక్షికంగా విఫలమైంది. రెండవ దశ విభజన సమయంలో ఎక్విప్ మెంట్ బే (ఇబి) డెక్ పై స్వల్ప వ్యవధిలో వైబ్రేషన్ డిస్టర్బెన్స్ ఉందని, అందుకు ప్రయోగం విఫలమైందని ఇస్రో వెల్లడించింది.