జై శ్రీరామ్..అయోధ్యలో భూమి పూజ..మోడీ షెడ్యూల్

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 06:41 AM IST
జై శ్రీరామ్..అయోధ్యలో భూమి పూజ..మోడీ షెడ్యూల్

అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో
సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించనున్నారు.



అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని రెండు గంటల పాటు గడుపనున్నారని తెలుస్తోంది. మొత్తం 175 మంది అతిథులకు ఆహ్వానం అందింది. భూమి పూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టి, 100 నదుల నుంచి నీరు వినియోగించనున్నారు.

భారత ప్రధాన మంత్రి షెడ్యూల్



బుధవారం నాడు మోడీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు.
10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో అయోధ్యకు పయనం.
11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు.
11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో ప్రత్యేక పూజలు.
10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని సమాచారం.
ఆరోగ్యం బాగుండాలని, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు.



మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు.
మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ.
మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశంచి ప్రసంగిస్తారు.
2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనం.