సీఎం అయినా సాధారణ జీవితమే

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 02:22 PM IST
సీఎం అయినా సాధారణ జీవితమే

జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ సీఎం రఘుబర్ దాస్ సైతం జంషెడ్ పూర్ ఈస్ట్ లో స్వతంత్ర అభ్యర్థి సరయూ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

కాంగ్రెస్‌- జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టపాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి షిబు సొరెన్‌ తనయుడైన హేమంత్‌ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూ పార్టీ  ఎదుగుదలలో విశేష కృషి చేశారు. ఫలితాల నేపథ్యంలో ఆయన భార్య,పిల్లలతో సాధారణ జీవితం గడుపుతున్న ఫోటోలు,సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోయిన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారానికి రెడీ అయ్యారు. 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

	H1.jpg	H2.jpg