Congress New President: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్..?

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

Congress New President: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్..?

Kamal Nath

Congress: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న మార్పుల్లో పెద్ద పాత్ర కోసం కమల్ నాథ్ పేరు చర్చలోకి వచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం త్వరలో సమావేశం అవుతుండగా.. దీని తరువాత కాంగ్రెస్‌లో పెద్ద పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రాబోయే కొద్ది నెలల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనుండగా.. కమల్‌నాథ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ అనారోగ్యంతో ఉండగా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇక కమల్ నాథ్ పార్టీకి ప్రముఖ నాయకుడు. ఆయనకు గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. నమ్మదగిన వ్యక్తి కూడా.

కాంగ్రెస్‌లో మార్పులు కోరుతూ కాంగ్రెస్ చీఫ్‌కు లేఖ రాసిన 23 మంది నాయకుల బృందంతో పాటు పార్టీ సీనియర్ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కమల్ నాథ్. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా కమల్ నాథ్ వ్యూహాలు పనిచేస్తాయని పార్టీ నమ్ముతుంది. SP, BSPతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్న కమల్ నాథ్ ఆ రాష్ట్రంలో బాగా పనిచేసే అవకాశం ఉంది. పార్లమెంటు రుతుపవనాల సమావేశం తర్వాత కమల్ నాథ్‌కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

అయితే, కమల్ నాథ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మార్చడానికి సంబంధించి అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. పార్టీలోని ఒక విభాగం రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని చాలాకాలంగా కోరుతున్నారు. కానీ, అందుకు రాహుల్ గాంధీ నిరాకరిస్తూ వస్తుండగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్‌ను నియమించేందుకు ఆలోచన చేస్తుంది. కానీ, కాంగ్రెస్ నుంచే ఈ విషయంలో వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కమల్ నాథ్ వయస్సు కూడా అందుకు ఓ కారణం.