జాగ్రత్తగా లేకపోతే, మరోసారి లాక్ డౌన్ విధిస్తా-యడ్యూరప్ప

  • Published By: murthy ,Published On : June 25, 2020 / 08:30 AM IST
జాగ్రత్తగా లేకపోతే, మరోసారి లాక్ డౌన్ విధిస్తా-యడ్యూరప్ప

కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సీఎం యడియూరప్ప ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండకపోతే రాష్ట్రంలో తిరిగి లాక్ డౌన్ విధిస్తానని హెచ్చరించారు.  

తిరిగి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, భౌతికదూరం పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని….418 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,73,105  పాజిటివ్ కేసులు నమోదు కాగా…2,71,696 మంది పూర్తిగా కోలుకోని ఇళ్ళకు తిరిగి వెళ్లగా 14,894 మంది మరణించారు. మరోక 1,86,514 మంది వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు.

 

Read:  దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు