Covid : కర్నాటకలో కలకలం, కోవిడ్ కోలుకున్న వారిలో టీబీ లక్షణాలు

కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Covid : కర్నాటకలో కలకలం, కోవిడ్ కోలుకున్న వారిలో టీబీ లక్షణాలు

Karnataka

Karnataka : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డవుతూనే ఉన్నాయి. అయితే..కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడం భయాందోళనలకు గురి చేస్తోంది. కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Read More : GST On Papad: అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ.. క్లారిటీ ఇచ్చిన CBIC

ఈ సందర్భంగా..ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. క్షయ వ్యాధి లక్షణాలున్న వారు తక్షణమే సంబంధిత ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీబీ లక్షణాలునన్ వారిని గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వైరస్ సోకిన రోగులు, వారి కుటుంబసభ్యులను కూడా పరీక్షిస్తున్నారు.

Read More :  Alligator : డ్రోన్ తినేసిన మొసలి.. నోట్లో నుంచి పొగలు.. వీడియో షేర్ చేసిన గూగుల్ సీఈఓ

డోర్ టు డోర్ సర్వేలో భాగంగా…ఇప్పటి వరకు కోవిడ్ కోలుకున్న బాధిత వ్యక్తులకు చెందిన 6 లక్షల 02 వేల 887 ఇండ్లను సందర్శించారు. 5 లక్షల 37 వేల 333 మంది నమూనాలను సేకరించారు. వీరిలో 24 వేల 598 మందిలో టీబీ లక్షణాలున్నట్లు గుర్తించారు. 104 మంది టీబీ వ్యాధిన బారిన పడ్డారని అధికారులు తేల్చారు. కుటుంబసభ్యులను పరీక్షిస్తే…8 వేల 523 మందిలో లక్షణాలున్నట్లు, వీరిలో 51 మందికి టీబీ సోకిందని అధికారులు నిర్ధారించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.