కరోనాను జయించిన కేరళ యువకుడికి అపూర్వ వీడ్కోలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 03:47 PM IST
కరోనాను జయించిన కేరళ యువకుడికి అపూర్వ వీడ్కోలు

భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గంటల్లో 525 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. అయితే 24 మరణాలు,490 కన్ఫర్డ్ కేసులతో దేశంలోనే మహారాష్ట్ర టాప్ లో నిలిచినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 42మంది కరోనాను జయించి డిశ్చార్జ్ కూడా అయ్యారని తెలిపింది.

ఇక మహారాష్ట్ర తర్వాత కరోనా కేసుల స్థానంలో ఢిల్లీ ఉంది. దేశరాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా కేసులు నమోదుకాగా,6మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 441 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో నిలిచింది. అయితే కరోనా కేసుల సంఖ్య ఇంకా సింగిల్ డిజిట్ లో ఉన్న రాష్ట్రాల్లో ఒడిషా,మిజోరాం,జార్ఖండ్,ఛత్తీస్ ఘడ్,గోవా,అరుణాచల్ ప్రదేశ్,పుదుచ్చేరి,హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి.

అయితే దేశం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 30శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే. తబ్లిగీ జమాత్ ప్రభావంతో 17రాష్ట్రాలకు కరోనా వైరస్ పాకింది. దేశం మొత్తం కరోనా కేసుల్లో 1023 కేసులు తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివేనని కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.

కరోనా మహమ్మారి వ్యాప్తిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధం అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం శనివారం నాటికి దేశవ్యాప్తంగా 184 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 42, కేరళలో 41, హరియాణాలో 24, ఉత్తరప్రదేశ్‌లో 19, కర్ణాటక 12, గుజరాత్‌లో 10 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కాగా, కేరళలో కరోనా బారిన పడి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఓ యువకుడికి అభినందన పూర్వక వీడ్కోలు లభించింది. కాసర్‌ గూఢ్‌లో మొట్టమొదటి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయ్యాడు. అతడు ఆస్పత్రి నుంచి వెళుతుండగా వైద్య సిబ్బంది, పేషెంట్లు కరతాళ ధ్వనులతో ఉత్సాహంగా  వీడ్కోలు పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ అతడు ముందుకు సాగాడు. కాగా, కోవిడ్‌ బారిన పడి కోలుకున్న కేరళలోని పతనంథిట్ట జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు థామస్‌ అబ్రహాం(93)ను, అతడి భార్య మరియమ్మ(88) శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాసర్గ్ గూడ్ జిల్లాలో నమోదైన 18కరోనా కేసుల్లో..ముగ్గురికి వరుస టెస్ట్ ల తర్వాత నెగిటీవ్ వచ్చింది. దీంతో కాసర్ గూఢ్ జనరల్ హాస్పిటల్ నుంచి వాళ్లు డిశ్చార్జ్ అయ్యారు.

అయితే దేశం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 30శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే. తబ్లిగీ జమాత్ ప్రభావంతో 17రాష్ట్రాలకు కరోనా వైరస్ పాకింది. దేశం మొత్తం కరోనా కేసుల్లో 1023 కేసులు తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివేనని కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.