ఈ దసరా వెరీ స్పెషల్ : దుర్గామాత స్థానంలో ‘‘వలస కూలీ తల్లి’’ విగ్రహాలు

  • Published By: nagamani ,Published On : October 16, 2020 / 10:31 AM IST
ఈ దసరా వెరీ స్పెషల్ : దుర్గామాత స్థానంలో ‘‘వలస కూలీ తల్లి’’ విగ్రహాలు

Durga Idol: కరోనాకు ముందు కరోనా తరువాత అనేలా నేటి పరిస్థితితులు మారిపోయాయి. జీవనశైలితో పాటు మనం సంప్రదాయంగా జరుపుకునే మన పండుగలు కూడా కరోనా ప్రభావంతో మార్పులతో జరుపుకుంటున్నాం.




అదే సమయంలో పండుగల్లో కరోనా కష్టాలు..సందేశాలను కూడా ఇస్తూ విభిన్నంగా..వినూత్నంగా..అవగహనా కల్పించేలా పండుగలు చేసుకోవటం మన భారతీయుల వినూత్నకు అద్దం పడుతోందని తప్పకుండా చెప్పాలి. గమనించాల్సిందే. ఉదాహరణకు వినాయక చవితి పండుగ సందర్భంగా కరోనాను గుర్తు చేస్తూ వినాయకుడు..ఎలుకలను కరోనా డాక్టర్లుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పలువురితో కలిసి చేసుకునే పండుగల్లో ఇలా కరోనాపై అవగాహన తెలియజేశాం..


త్వరలో విజయదశమి పండుగ రానుంది. విజయ దశమి. అంటే దసరా పండుగ. కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో వలసకూలీలు తమ పిల్లల్ని చంకనేసుకుని వందల వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. దసరా పండుగలో అమ్మవారు కూడా తమ పిల్లలు సల్లగా ఉండాలని రాక్షసుల్ని సంహరించి లోకానికి శాంతి చేకూర్చింది.


బిడ్డల కోసం కష్టపడే అమ్మలు కూడా అమ్మవార్లతోనే సమానం అని తెలియజేసేందుకు ‘‘కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలు తమ బిడ్డలను చంకలో వేసుకొని వేల కిలోమీటర్లు నడిచిన’’ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఇటువంటి గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ఇలా వలస కూలీల తల్లులు తమ బిడ్డల్ని ఎత్తుకున్న విగ్రహాలను ఆవిష్కరించబోతున్నారు. బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ ఈ విగ్రహాలను నెలకొల్పబోతోంది.


కాగా..దసరాపండుగ వస్తోందంటే చాలు అమ్మవారి విగ్రహాలను తయారుచేసే కార్మికులు నెలల నుంచే తమ పనుల్లో బిజీ బిజీ అయిపోతారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దసరా పండుగ అంగరంగ వైభోగంగా జరుపుకుంటారు. బెంగాల్ రాజధాని కలకత్తా అంటే కాళీకాదేవి అమ్మవారే గుర్తుకొస్తారు. దరసరాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ వీధిలో కాళికాదేవి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. నవరాత్రులు అమ్మవారికి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. కరోనా కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది మాత్రం బెంగాల్ ప్రజలు భిన్నంగా ఆలోచించారు. అమ్మవారి అవతారాన్ని వలస కూలీ తల్లులను అమ్మావారి రూపంలో కొలువుదీర్చాలనుకున్నారు.


లాక్‌డౌన్ సమయంలో లక్షలాది కార్మికులు దక్షిణాది నుంచి ఉత్తరాదికి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. చంటి బిడ్డలను కూడా ఎత్తుకొని మహిళలు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. తమ పిలల్లను మోస్తూ సాగించిన ప్రయాణం స్త్రీశక్తికి అద్దం పట్టింది. అందుకే వలస కార్మిక మహిళలను అపర కాళికలా పూజిస్తామని బెంగాలీలు చెబుతున్నారు.


దసరా పండుగ సందర్భంగా చాలా మండపాల్లో కాళిక విగ్రహాలకు బదులుగా వసల కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల విగ్రహాలను ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహాలను సిద్ధం చేశారు. చేతిలో చంటిబిడ్డ మరోవైపు సంచులను మోస్తూ.. వారు ఎలా కనిపించారో, అదే రూపంలో వలస కార్మిక మహిళల విగ్రహాలను రూపొందించారు. వారి తెగువ అమ్మవారిని గుర్తు చేశాయని స్థానికులు అంటున్నారు. అందుకే అమ్మవారిలా వారిని పూజించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.