భారత్ నేవీ ముందడుగు : ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై తేజస్‌ లాండింగ్‌ సక్సెస్

  • Published By: chvmurthy ,Published On : January 11, 2020 / 04:15 PM IST
భారత్ నేవీ ముందడుగు : ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై తేజస్‌ లాండింగ్‌ సక్సెస్

భారత నావికా దళం శనివారం, జనవరి11న,  మరో  సాహస ప్రక్రియను పూర్తి చేసింది. అతిపెద్ద యుద్ధ వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై తేజస్‌ లైట్‌ కంబాట్‌ యుద్ధవిమానం విజయవంతంగా లాండ్ చేసింది. ఇది భారత్ దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్సీఏ తేజాస్ విమానం.   

ఈ సందర్భంగా నెవీ అధికారులు మాట్లాడుతూ… తీరం వెంబడి యుద్ధ కార్యకలాపాలకు దేశీయంగా తయారు చేసిన సాంకేతికత ఉపయోగపడే విషయం నిరూపితమైందన్నారు. భారత నెవీ కోసం ట్విన్‌ ఇంజిన్‌ యుద్ధ విమానాలు తయారు చేసేందుకు మార్గం సుగమం అయిందని వెల్లడించారు. 

ఇప్పటి వరకు యూఎస్‌, రష్యా, ప్రాన్స్‌, యూకే, చైనా దేశాల్లో తయారైన జెట్లతో ప్రయోగాలు నిర్వహించాం. ఈ రోజు భారత్‌ దేశీయంగా రూపొందించిన ఎల్‌సీఏ తేజస్‌ విమానంతో విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశామన్నారు. ఎల్‌ఏసీ తేజస్‌ యుద్ధ విమానం ఇటీవలే వైమానిక దళంలో చేరింది.