Insurance Scheme : రైతులకు మేలు చేస్తున్న పశువుల బీమా పథకం..

పశువుల బీమా పధకం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పధకంతో దేశీయ, క్రాస్ బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిజేస్తారు. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయ

Insurance Scheme : రైతులకు మేలు చేస్తున్న పశువుల బీమా పథకం..

Insurance

Insurance Scheme : బీమా పథకాల్లో రైతు బీమా, పంట బీమా అనే రెండు పధకాల గురించే రైతాంగం వినిఉంటారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా, పంట నష్టం వాటిల్లినా ఈ బీమా పధకాల ద్వారా పరిహారం అందుతుంది. అయితే రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన పశువుల ప్రాణాలకు అనుకోని కారణాల వల్ల ముప్పు వాటిల్లితే రైతుకు తీరని నష్టం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో రైతులకు ఆర్ధిక వెన్నదన్ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పశువులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

పశువుల బీమా పధకం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పధకంతో దేశీయ, క్రాస్ బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిజేస్తారు. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయం ఉంది. ఈ బీమా తీసుకోవాలంటే పశువుకు మార్కెట్ విలువ మొత్తానికి ఏడాది 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రీమియం చెల్లిస్తే.. పశువు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొతాన్ని పరిహారంగా ఇస్తారు.

పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువలో 75 శాతాన్ని పరిహారంగా ఇస్తారు. మార్కెట్ విలువను రైతు, పశువైద్య అధికారి, బీమా కంపెనీల యాజమాన్యం సమక్షంలో నిర్ణయించబడుతుంది. అగ్ని ప్రమాదం, వరదలు, తుపానులు, భూకంపం లాంటి ప్రమాదాల వల్ల చనిపోయిన పశువులకు బీమా పరిహారం వస్తుంది. ఇక వివిధ రకాల వ్యాధులు, సర్జరీ చేసే సమయంలో పశువులు చనిపోతే బీమా అందుతుంది.

తమ పశువులకు బీమా చేసేందుకు రైతులు తమ ప్రాంతంలోని పశువైద్యుడు ధృవీకరించిన పశువు ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే పత్రంతోపాటు, పశువు వయస్సు నిర్ధారణ పత్రం, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు, మార్కెట్ విలువ, పశువు గుర్తింపు మచ్చలు తదితర వివరాలను బీమా అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పశువుల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరం.